రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంఎల్ ఏ మేరుగు నాగార్జున, ఎస్సీ(మాదిగ)కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావుమాదిగ, పార్టీ అధికారప్రతినిధి నారమల్లిపద్మజ ఘన నివాళులు అర్పించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం సజ్జల మాట్లాడారు. అంబేద్కర్ దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించారు. అంబేద్కర్ ఆలోచన విధానంలో అందరూ నడవాలి. ఆయన ఆశయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
బిసి,ఎస్సి,ఎస్టి, మైనారిటి,మహిళల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. దళితులపై దాడులు చేసి,భూములు లాక్కుని వారిని భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అయితే అదే దళిత వర్గాలను అక్కున చేర్చుకుని వారిని రాజకీయంగా, ఆర్దికంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృధ్ది చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నవ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని శాసనసభ్యుడు మేరుగునాగార్జున అన్నారు.