23.2 C
Hyderabad
May 7, 2024 21: 40 PM
Slider మెదక్

అమరవీరులను అనునిత్యం స్మరించుకోవాలి

#medakpolice

అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సందర్భంగా మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 264 మంది పోలీస్‌ ఆమరవీరుల పేర్లు, మెదక్ జిల్లాకు చెందిన 14 మంది పోలీసు అమరు వీరుల పేర్లను చదువుతూ వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ది, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తుల ఆగడాలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వారే పోలీసులు అని అన్నారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఏంతో మంది పొలీస్ అధికారుల ప్రాణ త్యాగాల వలన మనం ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవించ గలుగుతున్నాం అని, వారి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించాలని అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాము అని అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య ఉన్న వారికి పోలీస్‌ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మెదక్ జిల్లా అమరవీరుల కుటుంబాలను జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని పరామర్శించారు.

ఈ కుటుంబాలను పోలీసు వ్యవస్థ తరపున అన్ని వేళలో ఆదుకుంటాము అని అన్నారు, తదుపరి అమరుల కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ తరపున జ్ఞాపికలను అందచేసారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా మెదక్ డి.ఎస్.పి సైదులు,మెదక్ పట్టణ సి.ఐ మధు, మెదక్ రూరల్ సి.ఐ. విజయ్, జిల్లా పోలీస్ సిబ్బంది  మరియు యువకులు 60 యూనిట్ల రక్త దానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా అదనపు ఎస్.పి.డా.బి.బాలస్వామి, మెదక్ డి.ఎస్.పి సైదులు, తూప్రాన్ డి.ఎస్.పి. యాదగిరి రెడ్డి, మెదక్ ఏ.ఆర్. డి.ఎస్.పి. శ్రీనివాస్, ఎస్.బి.సి.ఐ. నవీన్ బాబు, మెదక్ పట్టణ సి.ఐ.మధు, మెదక్ రూరల్ సి.ఐ.విజయ్, అల్లాదుర్గ్ సి.ఐ జార్జ్ , ఆర్.ఐ. నాగేశ్వర్ రావ్, ఐ.టి కోర్.ఎస్.ఐ. సందీప్ రెడ్డి జిల్లా సిఐ.లు ఎస్ఐ.లు, ఆర్.ఎస్.ఐ. గార్లు, పోలీస్‌ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్‌ సిబ్బంది పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు ఆర్పించారు.

Related posts

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

ఇస్రో సక్సెస్: నింగిలోకి విజయవంతంగా జీశాట్-30

Satyam NEWS

తిరుమ‌ల‌ లో ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Satyam NEWS

Leave a Comment