36.2 C
Hyderabad
May 14, 2024 16: 39 PM
Slider విశాఖపట్నం

విశాఖ పోలీస్ కమిషనర్ గా త్రివిక్రమ్ వర్మ

Trivikram Verma as Visakha Police Commissioner #Visakha Police

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా గత సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న 2002 బ్యాచ్ కి చెందిన సిహెచ్ శ్రీకాంత్ ను ఐజిగా సిఐడి విభాగానికి బదిలీ చేస్తూ అర్ధరాత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న 2005 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన సీ.ఎం త్రివిక్రమ్ వర్మ ను నియమించారు.

ఆయనతోపాటు విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డిసిపిగా పనిచేస్తున్న 2017 బ్యాచ్ కు చెందిన సుమిత్ గరుడ సునీల్ ను ఎస్పీగా ఎస్ఐబి విభాగానికి బదిలీ చేశారు ఆయన స్థానంలో 2016 బ్యాచ్ కి చెందిన వాసన్ విద్యాసాగర్ నాయుడు ను విశాఖపట్నం నగర లా అండ్ ఆర్డర్ డీసీపీ గా నియమించారు. అదేవిధంగా అనకాపల్లి ఎస్పీగా పనిచేస్తున్న 2017 బ్యాచ్ కి చెందిన గౌతమి శాలిని విశాఖపట్నం ఏపీఎస్పీ 16 బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు.

ఆమె స్థానంలో కే.వీ మురళీకృష్ణను అనకాపల్లి ఎస్పీగా నియమించారు. వీరితో పాటు అల్లూరి జిల్లా రంప చోడవరం అదనపు ఎస్పీగా పని చేస్తున్న 2012 బ్యాచ్ కి చెందిన జి.కృష్ణ కాంత్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. ఆయనతోపాటు అల్లూరు జిల్లా పాడేరు అదనపు ఎస్పీగా పనిచేస్తున్న 2017 బ్యాచ్ కు చెందిన తుహిన్ సిన్హాను అల్లూరి ఎస్పీగా నియమించారు.

Related posts

లెజెండ్ ను కోల్పోయిన సినీ పరిశ్రమ

Murali Krishna

ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళకు క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

వైసీపీని గద్దె దించేవరకూ పోరాడుతూనే ఉంటా

Satyam NEWS

Leave a Comment