42.2 C
Hyderabad
May 3, 2024 18: 03 PM
Slider జాతీయం

జేపీసీ డిమాండ్ అర్ధ రహితం

#NCP President Sharad Pawar

అదానీ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం అర్ధం లేనిదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అదానీ సమస్యపై జేపీసీ ఏర్పాటు డిమాండ్‌ అర్ధ రహితమని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో పదేపదే లేవనెత్తుతున్న ఈ డిమాండ్‌ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. అదానీ విషయంలో జేపీసీ డిమాండ్ కి మా పార్టీ కూడా మద్దతిచ్చింది, అయితే జేపీసీలో అధికార పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుందని, కాబట్టి నిజం బయటకు రాదని నేను భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్యానెల్ విచారణ జరిపితే మరింత మెరుగ్గా ఉంటుందని పవార్ అన్నారు. పవార్ ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అంబానీ-అదానీల పేరును ఉపయోగిస్తున్నారు. అయితే మనం దేశానికి వారి సహకారం గురించి ఆలోచించాలి. మాకు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు రైతుల సమస్య చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను అని అన్నారు.

Related posts

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం

Bhavani

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్

Satyam NEWS

ఆశల ఐక్య పోరాటాల వల్లనే సమస్యల పరిష్కారం

Satyam NEWS

Leave a Comment