31.7 C
Hyderabad
May 7, 2024 02: 52 AM
Slider మహబూబ్ నగర్

ఎటు గాలి కొడితే అటు ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా

#JupallyKrishanaRao

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉందా? రెండు టీఆర్ఎస్ లు ఉన్నాయా? ఎవడ్రా నువ్వు… శుభమా అంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంటే ఈ ప్రశ్న వేస్తావు అంటూ కేసీఆర్ భక్తులు చిరాకు పడవచ్చు కానీ అలా చిరాకు పడే వాళ్లంతా ఒక్క సారి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వెళ్ళి వస్తే తెలుస్తుంది.

ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందో. కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపుల ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ టీఆర్ఎస్ రెండోది తర్వాత వచ్చిన టీఆర్ఎస్. ఈ రెంటు టీఆర్ఎస్ లు అక్కడ ప్రతిపక్షం లేని లోటు తీర్చేసుకుంటున్నాయి.

మునిసిపల్ ఎన్నికల్లోనే బయటపడ్డ బాగోతం

ఇటీవల ముగిసిన మునిసిపల్ ఎన్నికలలోనే ఈ విషయం బయటపడగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రెండు టీఆర్ఎస్ లను పిలిచి మాట్లాడారు. అయినా రెండు టీఆర్ఎస్ లూ వేరు వేరుగానే పోటీ చేశాయి. తెగినదాకా లాగడం ఇష్టం లేక చైర్మన్ గా పార్టీ నిర్ణయించిన వారినే అంగీకరించారు కానీ అభిప్రాయ బేధాలు మాత్రం అలానే ఉన్నాయి.

 టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి దణ్ణం పెట్టగా, ప్రతిపక్ష టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి శాల్యూట్ చేశారు. అయ్యా ఇదీ ఒక కొల్లాపూర్ … ఇద్దరు నేతల కధ.

Related posts

మెడికవర్ వద్ద ఫ్లైఓవర్ కోసం కృషి: ఎంపీ ఆదాల వెల్లడి

Satyam NEWS

అందాల శ్రీమతులు ఫ్యాషన్ హుందాలు

Satyam NEWS

కరోనా ఎలా విస్తరిస్తుందో సిరిసిల్లా చూస్తే తెలిసిపోతుంది

Satyam NEWS

Leave a Comment