39.2 C
Hyderabad
May 3, 2024 13: 07 PM
Slider ఆదిలాబాద్

టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#Minister Indrakan Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ  సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు.

ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇన్ని విజయాలు సాధించి ఈ స్థితిలో ఉన్నదంటే దానికి కారణం  కెసిఆర్ నాయకత్వం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి కారణమని తెలిపారు. 

యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న తెలంగాణ పథకాలు

సీయం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ పున‌ర్మిర్మాణం ఎంతో అద్భుతంగా జ‌రుగుతుంద‌ని వెల్లడించారు. సీయం కేసీఆర్  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా  న‌డిపిస్తున్నార‌న్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు యావత్ ‌దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు.

కాళేశ్వర నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో నేడు  తెలంగాణ ఎంతో సుభిక్షంగా  ఉంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్…  సీయం కేసీఆర్ అడుగుజాడ్ల‌లో న‌డుస్తూ  పార్టీని స‌మ‌ర్ధ‌వంతంగా  ముందుకు తీసుకువెళ్ళుతున్నార‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఈ సంద‌ర్బంగా మంత్రి  శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ  కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌త్య‌రాయ‌ణ గౌడ్, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మారుగొండ రాము, ధ‌ర్మాజీ రాజేందర్, రాంకిష‌న్ రెడ్డి,సుభాష్ రావు, అల్లోల గౌతంరెడ్డి, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్య‌క‌ర్త‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద‌నున్న అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించిన‌ అనంత‌రం కొండాపూర్ లో వ‌ల‌స కార్మికుల‌కు మంత్రి అల్లోల అన్న‌దానం చేశారు.

Related posts

బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం.. 8 మంది..

Sub Editor

అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చీఫ్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా

Sub Editor

ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

Satyam NEWS

Leave a Comment