27.7 C
Hyderabad
May 12, 2024 06: 11 AM
Slider నల్గొండ

పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

#saidireddy

పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండల,  గ్రామాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు 45 లక్షల 05 వెయ్యిల 220 రూపాయల కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో అండగా నిలుస్తుందని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని,పేద ప్రజల కష్టాలు తెలిసిన కెసిఆర్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ,ఎస్టీ, బిసి,మైనార్టీ,అగ్రవర్ణాల పేదల ఆడబిడ్డలకు అన్నగా,అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని కళ్యాణ లక్ష్మి రూపంలో లక్ష నుటపదహార్లు రూపాయలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా  ఉండాలన్నదే ముఖ్యమంత్రి కోరిక అన్నారు.ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ ప్రసవం దగ్గర్నుంచి కెసిఆర్ కిట్ తో మొదలై వివాహం అయ్యే  వరకు యువతులకు,మహిళలకు అనేక ప్రభుత్వ పథకాలు సిఎం  అందిస్తున్నారన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.సిఎం కెసిఆర్ అండతో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సైదిరెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేదలకు అందిస్తున్న సహాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఆపత్కాలంలో కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని,అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్

Satyam NEWS

ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు లంచం కావలట

Bhavani

4723 చెక్కులకు గాను రూ.20.27కోట్ల పంపిణీ

Murali Krishna

Leave a Comment