42.2 C
Hyderabad
May 3, 2024 18: 47 PM
Slider ప్రత్యేకం

ఎస్ సి, ఎస్ టి యువతకు ఎంఎస్ఎంఇ శిక్షణ

#msme

జాతీయ సూక్ష్మ, చిన్నమరియు మధ్యతరహా పరిశ్రమల సంస్థ (ni-msme) వారి ద్వారా షెడ్యూల్ కులాలు / షెడ్యూల్ తెగల యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వారి సౌజన్యంతో ఎస్.సి, ఎస్.టి హబ్ పథకం క్రింద ఈ క్రింది వృత్తులలో ఉచిత శిక్షణను షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల యువతకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ క్యాంపస్ లో శిక్షణ నిర్వహించనున్నారు.

ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి 18 నుండి 35 సంవత్సరములు గల ఎస్.సి, ఎస్.టి  యువతీ యువకుల నుండి దరఖాస్తులను అహ్వనిస్తున్నారు.

1. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (350 గంటల కోర్సు, విద్యార్హత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి)

2. సేల్స్ మేనేజర్ (550 గంటల కోర్సు, విద్యార్హత ఏదేని డిగ్రీ ఉండాలి)

3. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (300 గంటల కోర్స్, విద్యార్హత బిటెక్ / ఎమ్.బి.ఎ)

4. కమ్యూనికేషన్స్, సాఫ్ట్ స్కిల్స్ (120 గంటల కోర్స్, విద్యార్హత ఎస్.ఎస్ సి/10వ తరగతి)

5. సేల్స్ & ప్రీసేల్స్ ఎనలిస్ట్  (400 గంటల కోర్స్, విద్యార్హత ఏదేని డిగ్రీ )

అర్హత, ఆసక్తి కలిగిన ఎస్.సి, ఎస్.టి  యువతీ యువకులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Link :https://forms.gle/JAvDnRnnsKsQaAKN8

మరిన్ని వివరాల కోసం: info@nimsme.org ,  www.nimsme.org వెబ్ సైట్  ,  040-23633258,  9493923498 ఫోన్ నెంబర్ లను అభ్యర్థులు సంప్రదించవచ్చు.

Related posts

సారీ బిగ్ బాస్ అంతా తూచ్

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మకు ‘పవర్ స్టార్’ దిమ్మదిరిగే షాక్

Satyam NEWS

ఎలా స్వాగతించాలి…?

Satyam NEWS

Leave a Comment