టిక్కెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ మోసం చేయడంతో సీనియర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు గుండెపోటు వచ్చింది. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేస్తారని అతను ఊహించలేదు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలలో భాగంగా ఎనిమిదవ వార్డు బీసీ మహిళకు రిజర్వు చేశారు.
దాంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కాల్వ మల్లేశం తన భార్య కాల్వ స్వప్న తో నామినేషన్ వేయించాడు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి మరో ముగ్గురు పోటీలోకి దిగారు. పార్టీ సీనియర్ కార్యకర్త కావడం వల్ల టిక్కెట్ తన భార్యకే ఇస్తారనే నమ్మకంతో ఉన్నాడు. పార్టీకి సేవ చేసిన తననుకదని వేరేవారికి టిక్కెట్ ఇస్తారని కూడా అతను అనుకోలేదు. అయితే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీలో కొత్తగా చేరిన వారికి టిక్కెట్ ఇప్పించారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలోనే టికెట్ తన కివ్వకుండా కొత్త గా చేరినా అభ్యర్థి కి ఇవ్వడం తో మల్లేశం తీవ్ర మనస్తాపం చెందాడు. వెంటనే అతడికి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం అతను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ లో అయోమయ పరిస్థితి నెలకొంది.