అమరావతి రాజధానిగా ఉంచాలని కోరుతున్న రైతులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించారు. తమ ప్రాంతంలోని రైతులకు సంక్రాంతి పెద్ద పండుగ. అదీ కూడా రైతుల పండుగ. అలాంటి పండుగ రోజు ఏమీ తినకుండా ఉపవాసం చేయాలని రైతులు నిర్ణయించారు. తమకు తామే శిక్ష వేసుకుంటున్నామని పండుగ రోజు పస్తులు ఉంటామని రైతులు చెబుతున్నారు. సంక్రాంతి రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం చేయనున్నట్టు వారు ఆవేదనతో ప్రకటించారు. మరో వైపు అమరావతి రైతులు, మహిళలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. శాంతియుతంగా ధర్మాలు చేస్తున్నామని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో రైతులు మాట్లాడారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని మహిళలకు గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.
previous post