హైలో హైలెస్స హంస కదా నా కారు అనుకున్నాడో ఏమో ఈ కారు రూపకర్త వెంటనే హంస కారు తాయారు చేసాడు హైదరాబాద్ మెకానికల్ ఇంజనీరు సుధాకర్ యాదవ్ .ప్రతేకమైన కార్లు తయారుచేసి జూ పార్కు వద్ద గల తన ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తాడు అయన.తాజాగా అయన ప్రదర్శనశాలలో మరో హంస కారు తయారుచేసి ఉంచాడు.
రెండున్నర సంవత్సరాలు ఎంతో కృషి చేసి జీప్ ఇంజన్‌తో చూడముచ్చట గొల్పే హంస కారును అయన రూపొందించారు. ఇందులో నల్గురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. మంగళవారం ప్రధాన రహదారిపై దాని పనితీరును పరిశీలించదానికి సుధాకర్ యాదవ్ తీసుకు రాగ పలువురు ఆ వాహనాన్ని ఆసక్తి గా తిలకించారు.