33.2 C
Hyderabad
May 4, 2024 00: 55 AM
Slider ప్రత్యేకం

కరోనా కాటుతో భయం భయంగా బడికి…….

#schools

2  నెల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతులను  రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ  పాఠశాలలో కరోనా వ్యాధి విద్యార్థినీ విద్యార్థులు లోనూ, ఉపాధ్యాయుల్లో నూ తీవ్రంగా ప్రబలుతోంది. ఇప్పటివరకు  ఉపాధ్యాయులకు 70% మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15% కరోనా వ్యాధి సోకింది.

అదేవిధంగా  విద్యార్థులకు 75% కరోనా పరీక్షలు నిర్వహించగా 12% విద్యార్థులకు వ్యాధి సోకింది. పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్నం భోజనం పధకం నిర్వాహకులకు ఈ వ్యాధి సోకింది, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లోను ప్రాణం భయం పట్టుకుంది. ఇప్పటికే ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ మరికొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు  ఈ విద్యా సంవత్సరాన్ని 0 సంవత్సరం గా గుర్తించారు.

1 నుంచి 10వ తరగతి వరకు ఈ రాష్ట్రాల్లో విద్యార్థులకు పూర్తిగా పాఠాలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఏపిలో కూడా తక్షణమే పాఠశాలను మూసివేసి 1 తరగతి  10 తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా, రేడియోల ద్వారా, ఆన్ లైన్ చరవాణి ద్వారా  పాఠాలను బోధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు కోరుతున్నారు.

Related posts

మలయాళ హీరో సురేష్ గోపిపై ఛార్జ్‌షీట్

Satyam NEWS

శతాధిక వృద్ధుని మృతి

Bhavani

మునిసిపల్ కార్మికుల డిమాండ్లకు టీడీపీ సంఘీభావం

Satyam NEWS

Leave a Comment