29.7 C
Hyderabad
April 29, 2024 09: 46 AM
Slider ముఖ్యంశాలు

సహచరుని కుటుంబానికి అండ

#family

గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్​ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్​కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సబ్​ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ ​సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25 లక్షల రూపాయలను సేకరించి ప్రభాకర్ ​కుటుంబానికి అందించారు.

ఇందులో ఇరవై లక్షల రూపాయలను ప్రభాకర్​ మూడేళ్ల కూతురు అక్షయరెడ్డి పేర మ్యూచువల్​ ఫండ్స్ రూపంలో ఫిక్స్​డ్ ​డిపాజిట్​ చేశారు.మిగతా అయిదు లక్షల రూపాయలను ప్రభాకర్రెడ్డి తల్లిదండ్రులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, తల్లిదండ్రులు, ఎల్బీనగర్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న అన్న దయాకర్రెడ్డి, 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టాటా శ్రీధర్, రామకృష్ణ, శ్రీనివాసులతోపాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

రీడ్‌ ఇండియా సెలబ్రేషన్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్స్‌

Satyam NEWS

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి

Satyam NEWS

Leave a Comment