37.2 C
Hyderabad
May 6, 2024 13: 34 PM
Slider సంపాదకీయం

ఎలక్షన్ గిమ్మిక్: పసుపు హబ్ తో ఏమి ప్రయోజనం?

turmaric

తెలంగాణలో పసుపు ప్రమోషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఎలాంటి ఆనందం కలిగించడం లేదు. పసుపు బోర్డు కోసం తాము చేస్తున్న పోరాటాన్ని బిజెపి మళ్లీ ఓట్లుగా మలచుకునేందుకే ఈ మేరకు ఒక ప్రకటన చేసి ఉంటుందనే అనుమానం వారిలో తొంగి చూస్తున్నది. సంక్రాంతి లోపు పసుపు బోర్డును తీసుకువస్తామని బిజెపి నాయకులు చెప్పారు.

సంక్రాంతి పండుగ ముగియనున్నతరుణంలో ఈ మేరకు ఈ విధమైన అనధికారికి వార్తను ఢిల్లీ నుంచి వచ్చేలా చేసుకున్నారనే భావన ఇక్కడ వ్యక్తం అవుతున్నది. నిజామాబాద్ పసుపు రైతులతో సత్యంన్యూస్ కూలంకషంగా ఈ అంశాన్ని చర్చించినప్పుడు వారిలో ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. ఇది అధికారిక ప్రకటన కాదని వారు భావిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చి ఆ ప్రకటనలోని అంశాలను పరిశీలించిన అనంతరం మాత్రమే ఇది తమకు ఉపయోగపడుతుందా లేదా అనే అంశం స్పష్టమౌతుందని పసుపు రైతులు అంటున్నారు.

పసుపు హబ్ కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కొద్ది సేపటి కిందట వార్త వెలువడింది. నిజామాబాద్‌ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ ప్రమోషన్‌ హబ్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఆ వార్త సారాంశం. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ధి, మార్కెటింగ్‌ కోసం బోర్డు తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ వార్తలో వెల్లడించారు.

టీఐఈఎస్‌ పథకం కింద సుగంధద్రవ్యాల మార్కెటింగ్ హబ్  కోసం మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనుంది. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కోడ్  ముగిసిన అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడి పసుపు రైతులకు కావాల్సింది పసుపు బోర్డు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బాటు పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సి ఉంటుంది. పసుపు పంటకు సోకుతున్న తెగుళ్ల పై పరిశోధన జరపడం, తెగుళ్లకు నివారణ సూచించడం లాంటి కార్యకలాపాలు నిర్వహించాలనేది పసుపు రైతుల ప్రధాన కోరిక.

అదే విధంగా పసుపు పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించడం లో ఇలా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కీలక పాత్ర పోషించి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెలువడిన వార్త కేవలం నిజామాబాద్ లో ఒక ఆఫీసు పెట్టే విధంగానే ఉందని, అంతకు మించిన సమాచారం ఆ వార్తలో లేనందున తాము స్పందించలేకపోతున్నామని పసుపు రైతుల కోసం ఉద్యమం చేసిన రైతులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సమాచారం వచ్చే వరకూ తాము వేచి చూస్తామని వారు అంటున్నారు.

Related posts

లాక్ డౌన్ స్పెషల్: ఇంటికే మామిడి పండ్లు వచ్చేస్తాయ్

Satyam NEWS

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS

రవిప్రకాష్ సర్వేలో టీడీపీ కూటమికి 111 స్థానాలు

Satyam NEWS

Leave a Comment