29.7 C
Hyderabad
April 29, 2024 08: 16 AM
Slider ఆధ్యాత్మికం

అనంత పద్మనాభుడి ఆలయంలో లక్ష దీపాలు వెలిగే రోజు నేడు

padmanabha temple

తిరువనంతపురం లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం బంగారు వర్ణంలోకి మారిపోయే తరుణం వచ్చింది. నేటి సాయంత్రం శ్రీ పద్మనాభ స్వామి ఆలయం లో లక్ష దీపాల ఉత్సవం జరుగుతున్నది. ఆరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడగలిగే అద్భుత దృశ్యం ఇది. 56 రోజుల మురాజపం నేటితో ముగియబోతున్నది. ఆ సందర్భంగా లక్ష దీపాలు వెలిగించి ఉద్యాపన పలుకుతారు.

మకర సంక్రణం రోజున లక్షలాది దీపాలు వెలిగించినప్పుడు పద్మనాభ స్వామి అనంత వెలుగులు ప్రసాదిస్తాడు. శతాబ్దాల కిందట అంటే 1750 సంవత్సరంలో ట్రావెన్కోర్ ఆర్కిటెక్ట్ అనిసం తిరునాల్ మార్తాండ వర్మ దీనిని పున: ప్రారంభించారని చెబుతారు. పద్మనాభస్వామి ఆలయం శతాబ్దాలుగా చరిత్రలో నిలిచి ఉన్నది. శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో జరిగే మురాజపం లక్షదీప ఉత్సవం జరుపుకోవడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులకు ప్రత్యక్ష ప్రవేశం కల్పిస్తున్నారు. పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష దీప ఉత్సవంలో భాగంగా తొలిసారిగా 11,000 సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఉంచే చమురు దీపాలు మోటార్ల సహాయంతో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కాశీ లాంటి దేవాలయాలలో రివాల్వింగ్ ఆయిల్ లాంప్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లననీ 16, 17తేదీలలో కూడా భక్తుల దర్శనార్థం ఉంచుతారు.

Related posts

ఉద్యమకారులను గుండెల్లో పెట్టి చూసుకుంటా

Bhavani

నాకు మంత్రి పదవి రాదు: కొడాలి నాని

Satyam NEWS

ఏసీబీకి దొరికిపోయిన అవినీతి అధికారులు

Satyam NEWS

Leave a Comment