మేడారం జాతరలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు జంపన్న వాగులో దిగి ప్రాణాలు కోల్పోయారు. సమ్మక్క సారక్కలను దర్శించుకునే ముందు స్నానం చేయడానికి జంపన్న వాగులోకి దిగిన ఈ ఇద్దరు నీటిలో మునిగి మరణించారు.
మృతి చెందిన వారిని సికింద్రాబాద్ కు చెందిన వినయ్, దుమ్ముగూడెంలోని సుబ్బారవు్ పేటకు చెందిన వినోద్ గా గుర్తించారు. మేడారం జాతర సందర్భంగా తెలంగాణతోపాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వినయ్, వినోద్ లు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ములుగు జిల్లాలోని తడ్వాయ్ మండలం వెళ్లారు. అక్కడ ఈ దుర్ఘటన జరిగింది.