40.2 C
Hyderabad
May 6, 2024 15: 58 PM
Slider వరంగల్

కరోనా నిర్మూలన సేవలు అందించిన వారికి సత్కారం

#MuluguCollector

కరోనా నిర్మూలన కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు ములుగులో సన్మానించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వారికి సర్టిఫికెట్ లు అందచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య వారిని శాలువ తో సత్కరించారు.

కరోనా సీజన్ లో క్రమం తప్పకుండా రాట్ టెస్ట్ ల సంఖ్య పెంచుతూ కరోనా అదుపు కోసం వారు ప్రయత్నించారని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన వెంటనే స్పందించి కోవిడ్ నిర్మూలన కార్యక్రమంలో టెస్టుల సంఖ్య పెంచే విధంగా ప్రోత్సహిస్తున్న వారిని సన్మానించారు. ఇదే ఉత్సాహంతో మిగతా ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది వారి పరిధిలో ఉన్న గ్రామాలలో RAT Test ల  సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ కోరారు.

ఈరోజు ప్రశంసాపత్రాలు పొందిన వారి వివరాలు: 1. అనురాధ స్వరూప కాళిక ఆరోగ్య కార్యకర్త, 2. సమత రాణి సాంబ లక్ష్మి ఆశా కార్యకర్త.

ఈ రోజు కార్యక్రమంలో లో ప్రోగ్రామ్ ఆఫీసర్ లు డాక్టర్ శ్యాంసుందర్, Dr. అరుణ అరుణ Dr. సీతారామరాజు, జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు దుర్గారావు ,నవీన్ రాజ్ కుమార్ ,ప్రతాప్, భాస్కర్ పాల్గొన్నారు.

Related posts

అమ్మవారి దేవాలయానికి రక్షణ:మేఘారెడ్డి

Satyam NEWS

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

Bhavani

అంటు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Bhavani

Leave a Comment