28.7 C
Hyderabad
April 27, 2024 05: 31 AM
Slider మహబూబ్ నగర్

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

nallamala

కృష్ణ నదీజలాలు, సహజ వనరులున్న నాగర్ కర్నూల్  జిల్లాను టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాసగౌడ్‌ అన్నారు. మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే విప్ గువ్వల బాలరాజు తో కలిసి అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో రూ. 50 కోట్ల రూపాయలతో నిర్మించిన హరిత రిసార్ట్స్ ను ఆయన ప్రారంభించారు.

స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. మున్ననూర్ రూ.14 కోట్లతో హరిత హోటల్‌, 26 కోట్లతో ఈగలపెంట లో నిర్మించిన రీస్టార్ట్, 10 కోట్లతో ఉమామహేశ్వరం వద్ద మెట్లను నల్లమల ప్రాంతంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్మించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో నల్లమల్ల ప్రాంతం  టూరిజం జోన్‌గా అభివృద్ధి చేసి, ఆహ్లాదకరంగా గడిపేలా, విదేశీయులు కూడా బస చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం  టూరిజం ప్యాకేజీలను  చేపడతామన్నారు.

పర్యాటక అభివృద్ధికి పుష్కలంగా ఉన్న ప్రాంతాన్ని గత పాలకులు తుపాకుల మోతతో మారుమోగిచారని, తెలంగాణ స్వరాష్ట్రంలో కెసిఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో నల్లమల్ల  ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తున్నమని మంత్రి చెప్పారు. పాపికొండలు గోవా లను తలదన్నే విధంగా నల్లమల్ల ను అభివృద్ధి పరుస్తామని మంత్రి పేర్కొన్నారు. పుష్కలమైన అటవీ సంపద కలిగి, సహజ నీటి వనరులున్న నాగర్ కర్నూల్ జిల్లాను జాతీయ స్థాయిలో రాణించేలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.

పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన హోటళ్లలో స్థానిక వంటకాలతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటాలన్నారు.  పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ గతంలో నల్లగొండ ప్రాంతాన్ని సందర్శించాలంటే ప్రజలకు కు భయబ్రాంతులకు గురి చేసే వారిని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ నేత కేటీఆర్ హయాంలో నల్లమల్ల వనరులతో తెలంగాణ వనరులను ప్రపంచ స్థాయికి చాటే విధంగా అభివృద్ధి పరుస్తున్నరని, అందుకు సహకరించి అభివృద్ధి పరుస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నల్లమల్ల ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెలియపరిచేలా నేడు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్వరాష్ట్రంలో మనకు మనం అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విప్ కూతుళ్ళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పెద్దపల్లి పద్మావతి కలెక్టర్‌ ఈ శ్రీధర్  టూరిజం ఎండీ మనోహర్‌, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కాలంలో ఇంత తక్కువ కూలి ఇస్తే ఎలా?

Satyam NEWS

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

Satyam NEWS

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామికి అపచారం

Satyam NEWS

Leave a Comment