కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావు, భాస్కర్లకు నెల రోజుల జైలుశిక్ష ,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎయిడెడ్ నియామకం అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని పిటీషనర్లు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని హైకోర్టు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది.
previous post