29.7 C
Hyderabad
May 3, 2024 05: 01 AM
Slider వరంగల్

పోలింగ్ విధులను పకడ్బందిగా నిర్వహించాలి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్, ములుగు జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు.

డిగ్రీ కళాశాల లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం లో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ను పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది కోసం త్రాగునీరు, టాయిలెట్ల, పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్ తో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది కి మంచి భోజన వసతులు కల్పించాలని అన్నారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవిఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవిఎం యంత్రాలను సరి చూసి అందజేయాలని కలెక్టర్ తెలిపారు. రిజర్వ్ పోలింగ్ సామాగ్రి, ఈవిఎం యంత్రాల సెక్టార్ అధికారుల వద్ద ఉంటాయని, పోలింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులు రిజర్వ్ ఈ.వి.ఎం యంత్రాలతో భర్తి చేయాలని అన్నారు.

పోలింగ్ నాడు సెక్టార్ అధికారులు ప్రైవేట్ వాహనాల్లో ఈ.వి.ఎం యంత్రాల, పోలింగ్ సామాగ్రి తరలించడానికి వీలు లేదని, ప్రభుత్వ వాహనాల్లో పోలీస్ భద్రత మధ్య సెక్టార్ అధికారులు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుండి మాక్ పోలింగ్ నివేదిక, పోలింగ్ ప్రారంభం నివేదిక, ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాలను సకాలంలో అందజేసేలా సెక్టార్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పోలింగ్ ప్రారంభం కంటే ముందు తప్పనిసరిగా కంట్రోల్ యూనిట్ వద్ద మాక్ పోల్ వివరాలు క్లియర్ చేయాలని, వి.వి.ప్యాట్ స్లిప్పులను బ్లాక్ కవర్ లో సీజ్ చేయాలని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్ల వివరాలను 17ఏ
రీజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు.

పోలింగ్ అనంతరం పోలైన ఈవీఎం యంత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రి, నివేదికలను రిసెప్షన్ కేంద్రంలో అందజేయాలని, రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ కేంద్రాల వారిగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అంకిత్, అదనపు కలెక్టర్ డి . వేణు గోపాల్, ఆర్ డి ఓ కే. సత్య పాల్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu

Satyam NEWS

ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్

Sub Editor

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

Bhavani

Leave a Comment