కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, ఎంఎంటీఎస్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఎంఎంటీఎస్ డ్రైవర్ ఈ ప్రమాదంలో చిక్కుకుపోయాడు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో నేటి ఉదయం ఆగివున్న ఇంటర్ సిటీ ట్రైన్ వెనక నుంచి వచ్చిన ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొన్నది. టెక్నికల్ లోపం వల్లే ఆగివున్న ట్రైన్ వెనక నుండి కొట్టినట్ట అధికారులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆగి వున్న ట్రైన్ కాబట్టి అందులో ప్రయాణీకులు ఎవరూ లేరు. అదే ఆ రైలు బయలుదేరే సమయం అయిఉంటే పెను ప్రమాదం జరిగిఉండేది. దాంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.