39.2 C
Hyderabad
May 4, 2024 19: 36 PM
Slider నల్గొండ

నూతనోత్సాహాలకు నాంది తెలుగువారి ఉగాది

#ugadi

నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగు వారి ఉగాది పండుగ అని గ్రీన్ వుడ్ పాఠశాల చైర్మన్ తుమ్మా సరితా మరెడ్డీ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ సరిత మరెడ్డి మాట్లాడుతూ ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చిందని, సంవత్సరంలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారని, నూతన ఉత్సాహాలకు నంది మన తెలుగువారి ఉగాది పండుగ అని,వసంత ఋతువు ఆగమనంతో ప్రారంభమైన రోజున షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి తయారు చేసి సేవిస్తారని, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలిగిన బెల్లం, చింతపండు,ఉప్పు,కారం,వేపపువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారని అన్నారు.అనంతరం షడ్రుచుల కలయికతో తయారుచేసిన ఉగాది పచ్చడి విద్యార్థులందరికీ అందజేసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అధిరాజు వెంకట కృష్ణారావు, ప్రధానోపాధ్యాయులు సలిబిండ్ల రాజారెడ్డి,పి ఈ టి ఇందిరాల రామకృష్ణ, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, విద్యార్ధినీ,విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏఎస్ రావు నగర్ లో ఘనంగా శ్రీకృష్ణాఅష్టమి వేడుకలు

Satyam NEWS

కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Satyam NEWS

బేతని చర్చ్ లో క్రిస్మస్ కానుకల పంపిణీ

Satyam NEWS

Leave a Comment