Slider సంపాదకీయం

పాపం తమిళ సై: ఇక తెలంగాణ లో పని చేయడం కష్టం

#Sai Soundara Rajan

తమిళ సై సౌందర రాజన్ తెలంగాణ లో ఇక గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తున్నది. సహాయ నిరాకరణ చేస్తే ఫర్వాలేదు కొంత మేరకు సర్దుకోవచ్చు. ఆమెను పూర్తిగా అవమానిస్తున్నది. తమిళసై రాజ్యాంగ విధులు నిర్వర్తించేందుకు వస్తున్న అడ్డంకులు సాధారణమైనవి కాదు.

ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. చాలా రాష్ట్రాలలో బీజేపీ తనకు కావాల్సిన వారిని, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని గవర్నర్లుగా పంపుతున్నది. చాలా రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అభీష్టానికి అనుకూలంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు సంబంధిత ముఖ్యమంత్రులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ల ధాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రులు లబోదిబో మంటున్నారు. అయితే తెలంగాణలో రివర్సు జరుగుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకు గవర్నర్ తట్టుకోలేక లబోదిబో మంటున్నారు. ‘‘ఆడ బిడ్డ’’ను అవమానిస్తారా? అంటూ గవర్నర్ పబ్లిక్ లో వాపోయినా కూడా ఎక్కడ నుంచి కూడా స్పందన రాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అవమానిస్తున్నారని గవర్నర్ తమిళ సై పబ్లిక్ గా న్యూస్ ఛానెళ్లలో ఆరోపణ చేశారు. ఎవరూ స్పందించలేదు.

ఏకంగా జాతీయ న్యూస్ ఛానెల్ లో ఆమె తన బాధలు చెప్పుకున్నా తీరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ, అధికార గణం ఎవరూ కూడా గవర్నర్ తమిళ సై ని ఖాతరు చేసే పరిస్థితి లేదు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చే అవార్డుల కార్యక్రమం తాజాగా గవర్నర్ కు తీరని తలవంపులు తెచ్చి పెట్టేదిగా జరిగింది.

రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో ఉండి, రాజ్ భవన్ నుంచి కార్యకలాపాలు సాగించే రెడ్ క్రాస్ సంస్థ ఇచ్చే అవార్డులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు. మంత్రులు నివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి అవార్డులు అందుకోవడానికి రావాలి. అయితే వారు రాలేదు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కూడా అవార్డు తీసుకోవడానికి రాలేదు.

వీరంతా అవార్డు స్వీకర్తల జాబితాలో ఉన్నారు. వీరికి రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అయితే వారెవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు 19 కలెక్టర్లు, ఒక పోలీస్ కమిషనర్, ఐదుగురు ఎస్ పిలు కూడా అవార్డులు తీసుకోవడానికి రాలేదు. ఇది గవర్నర్ కు తీరని అవమానం. గవర్నర్ ఇక ఈ రాష్ట్రంలో పని చేయలేరు.

Related posts

వైసీపీ లీడర్ కూతురు కోసం పేద మెరిట్ ముస్లిం విద్యార్ధిని బలి

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

ఏపిలో హిందూ దేవాలయాలను కొల్లగొడుతున్నారు

Satyam NEWS

Leave a Comment