38.2 C
Hyderabad
May 5, 2024 19: 29 PM
Slider నల్గొండ

అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం

#unorganized sector

అసంఘటిత రంగం లోని కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయటంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇటుక బట్టీల, బూడిద లోడింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయంలో లాక్ డౌన్ ప్రకటించినంత వరకు ప్రతి కార్మికుడికి 7500 ఇవ్వాలని కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కోరారు.

ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులకు ఈనాడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎగుమతి, దిగుమతి పైకం పెంచాలని కోరారు. పనిచేసే  ప్రదేశంలో ఏలాంటి ప్రమాదం జరిగిన పరిశ్రమ యాజమాన్యంమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

ఇటుక బట్టీలలో పనిచేసే వలస కార్మికులకు వారి వారి సొంత ఊర్లకు వెళ్ళటానికి అయ్యే పూర్తి ఖర్చు యాజమాన్యంమే, భరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోల తాతారావు, మామిడి లక్ష్మణ్, రాంబాబు, సైదులు,మాలక్ష్మి ఏకలక్ష్మి,రమణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లవ్ ఎఫైర్:ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇద్దరి ఆత్మహత్య

Satyam NEWS

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS

పవన్‌ కల్యాణ్ కాపుల తరఫున మాట్లాడడంలేదు

Satyam NEWS

Leave a Comment