హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వేళల్లో ప్రారంభమైన వర్షం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో కురుస్తూ రాత్రి వరకూ ప్రజలను ఇబ్బంది పెట్టింది. మల్కాజ్ గిరిలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసింది. పెద్ద పెద్ద మంచు గడ్డలు పడటంతో జనం భయాందోళనలకు గురయ్యారు.
previous post