38.2 C
Hyderabad
April 29, 2024 14: 38 PM
Slider ముఖ్యంశాలు

జగన్ సర్కారు కు సుప్రీం కోర్టు మరో ఝలక్

#supremecourtofindia

తమ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టిన జగన్ సర్కార్ రెండు తెలుగు న్యూస్ ఛానెళ్లను కూడా అదే కేసులో చేర్చిన విషయం తెలిసిందే.

టీవీ5,ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లపై కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా నేడు సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఆర్టికల్ 124ఏకు సంబంధించిన అంశంపై వివరణాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 124ఏను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

ఈ కేసులో ఎంపీ రఘురామరాజు మొదటి ముద్దాయిగా వున్నారు.

ఛానెల్స్ తరఫున దివాన్, లూథ్రా వాదించారు. కేసు తదుపరి విచారణ లోగా ఛానెల్ సిబ్బందిపై ఏచర్యలూ తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది.

దేశద్రోహం అన్న అంశానికి పరిధులు నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Related posts

భారతదేశానికి స్వాతంత్య్రము తెచ్చిన బోసినవ్వుల బాపూజీ

Satyam NEWS

రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా 14 వ మహాసభలు జయప్రదం చేయండి

Satyam NEWS

సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో రైతు సేవ ఎరువుల కేంద్రం

Satyam NEWS

Leave a Comment