కడప జిల్లా రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయినపల్లి వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుండి 300 గ్రాముల గంజాయిని మన్నూరు ఎస్ ఐ హనుమంతు వారి సిబ్బంది పట్టుకున్నారు. బోయనపల్లిలోని హరిత హోటల్ సమీపంలో ఎవరో గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు దాడి చేశారు.
తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచిని పరిశీలించగా సంచిలో 300 వందల గ్రాముల గంజాయి ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో శేఖర్ బోయనపల్లికి చెందిన వ్యక్తి కాగా, శీనయ్య అనే వ్యక్తి నెల్లూరు జిల్లా రాపురు చెందిన వాడు, నిందితులను రాజంపేట మండల మేజిస్ట్రేట్ రవిశంకర్ రెడ్డి ముందు హాజరు పరిచారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మన్నూరు యస్ .ఐ హనుమంతు మీడియా కు తెలిపారు.