30.7 C
Hyderabad
May 5, 2024 04: 15 AM
Slider రంగారెడ్డి

స్వగృహాలు నిర్మిస్తానని మాట ఇచ్చిన ఉప్పల

#UppalaTrust

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల పరిధిలోని చుక్కాపూర్  గ్రామం లోని ఐదు కుటుంబాల వారికి గృహాలు నిర్మించి ఇస్తానని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హామీ ఇచ్చారు.

 బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ చుక్కాపూర్ గ్రామంలో కనీసం నివసించటానికి గుడిసె కూడా సరిగా లేని, కూలిపోయిన గృహాలలో జీవనం సాగిస్తున్న వారిని చూసి చలించిన ఆయన త్వరలోనే నివాసయోగ్య మైన  ఇల్లు నిర్మించి ఇస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుక్కాపూర్ గ్రామంలో కొప్పు జయమ్మ, బ్యాగరి ఎల్లమ్మ, బ్యాగరి ఎల్లమ్మ ,కొప్పు నర్సమ్మ కొప్పు రాములమ్మ వారు నివసిస్తున్న నివాస దీనస్థితిని చూసి చెల్లించి ఈ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నివాసంలో ఏవిధంగా జీవిస్తున్నారు తెలియడం లేదని వారి బాధలను తెలపడం వర్ణనాతీతం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ వై ఎం పి పి శ్రీనివాస్ రెడ్డి గ్రామ సర్పంచ్ దాసరి కృష్ణమ్మ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇ మాజీ ఎంపిటిసి యాదయ్య చంద్ర కుమార్ గ్రామస్తులు మహిళలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ‘కంటివెలుగు’

Satyam NEWS

మొక్కలు నాటిన హీరోయిన్ నభా నటేష్

Satyam NEWS

బీ వేర్ అఫ్ కెసిఆర్:ఆయనతో స్నేహం చేస్తే జగన్ కు చీకటే

Satyam NEWS

Leave a Comment