38.2 C
Hyderabad
May 5, 2024 22: 41 PM
Slider ముఖ్యంశాలు

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

#ministerniranjanreddy

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వారు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తున్నది ఆయన అన్నారు.

సోమవారం వనపర్తిలోని తన నివాసంలో చెక్కుల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం100 శాతం సబ్సిడీతో రూ.50,000/- రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఎస్సీ కులాలు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా స్వావలంబన పొందాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని మంత్రి సూచించారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి మల్లికార్జున్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు ఎంపీపీ, చైర్మన్ కరుణశ్రీ, కోళ్ల వెంకటేష్, ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ భాను ప్రసాద్  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బిజెపి ఆందోళన

Satyam NEWS

అత్యాచార బాధితులే అభ్యర్థులు

Sub Editor

రీసెర్వ్డ్:రైల్ లో పరమేశ్వరునికి ప్రత్యేక బెర్త్

Satyam NEWS

Leave a Comment