31.7 C
Hyderabad
May 2, 2024 10: 22 AM
Slider ముఖ్యంశాలు

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

#CM Jagan

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించింది. తాజాగా జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో కొత్తగా మరో జేసీ పోస్టును ఏర్పాటు చేసింది.

జాయింట్ కలెక్టర్-హౌసింగ్ కింద గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, ఏపీ ఫైబర్ నెట్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్, ఇంధన శాఖలు ఉండనున్నాయి. పేదలందరికీ ఇళ్ల పథకం కింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారులకు ఇంటిపట్టాలను కూడా అందజేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఇళ్ల నిర్మాణం కోసం తొలి రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ. 50,944 కోట్లను ఖర్చు చేయనుంది. తొలి విడతలో రూ. 22,084 కోట్లు, రెండో విడతలో రూ. 22,860 కోట్లను వెచ్చించనుంది. ఈ నిర్మాణ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టును క్రియేట్ చేసింది.

Related posts

ఇకనైనా పాజిటీవ్ గా ఆలోచించాలి జగన్

Satyam NEWS

భూ సేకరణ వేగంగా చేయాలి

Bhavani

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment