38.2 C
Hyderabad
May 3, 2024 22: 59 PM
Slider మహబూబ్ నగర్

ఉద్యోగార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి!

#kollapur

వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవరం హనుమంత్ రావు సూచించారు. బుధవారం కొల్లాపూర్ శాఖ గ్రంథాలయాన్ని నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవన్ హనుమంతురావు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

గ్రంథాలయానికి వివిధ పోటీ పరీక్షలకు అవసరయ్యే కాంపిటేషన్ పుస్తకాలను చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న 90,వేలఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించిందని ఆయన వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను జారీ చేస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు లుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు అవసరమగు కాంపిటేషన్ పుస్తకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గ్రంథాలయాలకు పంపిణీ చేసిందన్నారు. ఉద్యోగార్థులు, విద్యార్థులు గ్రంథాలయాలలో చదువుకునేందుకు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు కాంపిటీషన్ పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు వసతులు కల్పించడం జరిగిందని చైర్మన్ వివరించారు.

గ్రంథాలయాలలో ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఉద్యోగార్థులకు చైర్మన్ మాధవరం హనుమంతు రావు సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవన సముదాయాన్ని చైర్మన్ సందర్శించి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్ మల్లయ్యను చైర్మన్ మాధవరం హనుమంతురావు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సుబ్బయ్య, తెల్కపల్లి గ్రామ ఉపసర్పంచ్ కృష్ణయ్య, తెరాస నాయకులు కిషోర్, మల్లేష్, నాయకులు జి వెంకటస్వామి, సురేష్, షఫీ, చంద్రమౌళి, గొల్ల వెంకటస్వామి,ఖతల్ తదితరులు ఉన్నారు.

Related posts

లిక్కర్ స్కాంలో సంచలనం

Murali Krishna

ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయే సోషల్ మీడియా పై ఆశలు

Bhavani

గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్

Satyam NEWS

Leave a Comment