28.7 C
Hyderabad
April 28, 2024 06: 46 AM
Slider ముఖ్యంశాలు

లిక్కర్ స్కాంలో సంచలనం

#ed

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఉన్నాయి. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ పని చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు.

Related posts

కబుర్లు చెప్పడం కాదు ఒక్కొక్కరు 10 లక్షలు ఇవ్వండి

Satyam NEWS

సోనియా గాంధీ కార్యదర్శిపై రేప్ కేసు నమోదు

Satyam NEWS

ఈటల బిజెపి ప్రవేశం ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Satyam NEWS

Leave a Comment