37.7 C
Hyderabad
May 4, 2024 11: 46 AM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయే సోషల్ మీడియా పై ఆశలు

#Telugu Desam Party senior leader Jagan Raju Eddeva

ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం నమ్మకం కోల్పోయే సోషల్ మీడియా పై ఆధారపడాలని ఎమ్మెల్యేలకు,మంత్రులకు హితబోధ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జగన్ రాజు ఎద్దేవా చేశారు.అన్నమయ్య జిల్లా రాజంపేటలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో రోజురోజుకు జనం మద్దతు కోల్పోతున్న వైసిపి సర్కార్ గత ఎన్నికల్లో లాగా ఈ ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాలో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు వైకాపా అభ్యర్థులకు వాత పెట్టారని ,అయితే మంత్రులు ఎమ్మెల్యేల సమావేశాల్లో ఈ గెలుపు చూసి తెలుగుదేశం బలుపు అనుకుంటుందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఎన్నికల్లో ఓటు ద్వారా పాలక పక్షం పట్ల ఇచ్చిన తీర్పుకు కూడా ఓర్వలేక అహంతో మాట్లాడినట్లు కనిపిస్తోందన్నారు.108 నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రులు వేసిన ఓట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం.

అధికారంలో ఉన్నామని అహంకారంతో ఉన్నట్లేనని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర చూసి ఒకవైపు వణికిపోతూ గడపగడపకు పోవాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారని, అంటే ఇప్పటివరకు జనంలోకి వైకాపా ప్రజాప్రతినిధులు ఏ మేరకు వెళ్లారో సీఎం మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోందన్నారు . నేల విడిచి సాము చేయడం అంటే ఈ ప్రభుత్వాని చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు .

జనం బలంతోనే లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవుతున్న విషయం చూసి ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సీఎం సూచించడం చూస్తే మరోసారి జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు.ఇంకా ఈకార్యక్రమంలో అయన వెంట రాజంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దుల సాగర్, ముస్లిం మైనారిటీ నాయకులు కరీముల్లా, మండల సీనియర్ నాయకులు జీవి సుబ్బరాజు, పార్టీ నాయకులు గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంబర్పేటలో ఆందోళన బాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులు ……

Satyam NEWS

అక్టోబర్ ఫస్ట్ న తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ…!

Satyam NEWS

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

Leave a Comment