38.2 C
Hyderabad
April 29, 2024 22: 09 PM
Slider ముఖ్యంశాలు

రామతీర్థం లో వైభవోపేతంగా వైకుంఠ ద్వార దర్శనం

పాల సముద్రంలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్న సమయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా.. ఆ శ్రీ మహా విష్ణువు ను దర్శించుకోవడమే….ముక్కోటి ఏకాదశి.. దానినే ఉత్తర ద్వార దర్శనం అని పురణా లలో ఉటంకించిన దరిమిలా… అన్ని ప్రముఖ దేవాలయాలలో వైభవోపేతంగా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.దైవం ఉందనటానికి…స్వామి వారు ఊరేగుతున్న తరుణంలో వరుణుడు పులకించాడు.ఆకాశం మేఘావృతమై… చిరుజల్లులు తో దైవం సాక్షాత్కరించారని భక్తులు అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో ని విజయనగరం జిల్లా రామతీర్థం, అలాగే విజయనగరం లో శివాలయం వీధిలో శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం, అదే విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తోటపాలెంకు వెళ్లే క్రమంలో బాలాజీ నగర్ శ్రీ వేంకటేశ్వరుని కోవెల లో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే ఆయా దేవాలయాలలో స్వామి వారు ప్రత్యేక పూజలందుకున్నారు.స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ,ఎస్.ఎస్.వీ.వీ భగవాన్, పేర్రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ విమానయాన రంగానికి మరో ఎదురు దెబ్బ

Satyam NEWS

వైద్య కళాశాల నిర్మాణ పనుల పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్

Satyam NEWS

సత్యం న్యూస్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment