38.2 C
Hyderabad
May 5, 2024 21: 54 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి దేవాదాయ భూములను కాపాడండి

bhandi

వనపర్తి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూములను కాపాడాలని, రూ. 200 కోట్ల దేవాదాయ శాఖ భూమిపై మంత్రి కన్ను పడిందని, అధికార‌ మదంతో దర్జాగా మంత్రి నిరంజన్ రెడ్డి అనుచరుల భూ కబ్జాకు పాల్పడుతున్నారని, వనపర్తి దేవాదాయ భూములను కాపాడలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందించారు.

మంత్రి క‌బ్జాపై అధికారులూ ప‌ట్టించుకోవ‌డం లేదు

ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మర్యాద పూర్వకంగా ప్ర‌వీణ్ కుమార్ క‌లిశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో అధికార టీఆరెఎస్ పార్టీ, మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోద్బలంతో రూ. 200 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములను తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మునిసిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

సీఎంకూ ఫిర్యాదు చేశాం

అంతేకాకుండా ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సంబంధిత శాఖ ఉన్నతిధికారులకు పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దింతో దేవాదాయ భూములను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సామాజిక కార్యకర్త ప్రవీణ్ కోరారు. మంత్రి నిరంజన్ రెడ్డి, అతని అనుచరుల ల్యాండ్ మాఫియాపై పోరాటం ఉదృతం చేస్తామని ఆయన చెప్పారు.

పోరాటానికి మ‌ద్ద‌తివ్వాలి

దేవాదాయ భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదన్నారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కి ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దిడ్డి. ప్రవీణ్ కుమార్ వినతి అందజేశారు.

ఈ కార్యక్రమంలో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎస్. లక్ష్మీకాంత్ రెడ్డి, నీరటి బాలవర్ధన్ రెడ్డి, జె.కె. రమేష్, వినిత్ రెడ్డి, విజయ్ కుమార్, సమీర్, శశికాంత్, ప్రేమ్, సుభాష్, పవన్, కిరణ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అరెస్టు చేసిన ఏసీబీ

Sub Editor

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సచీవాలయ కార్యదర్శి

Satyam NEWS

శిరోముండనం వరప్రసాద్ చే ఆత్మగౌరవ లోగో ఆవిష్కరణ

Bhavani

Leave a Comment