37.2 C
Hyderabad
April 30, 2024 13: 03 PM
Slider గుంటూరు

శిరోముండనం వరప్రసాద్ చే ఆత్మగౌరవ లోగో ఆవిష్కరణ

#Shiromundanam

రాష్ట్రంలో దళిత బహుజన కులాలు పిడికెడు ఆత్మగౌరవం కోసం అన్న నినాదంతో పోరాడతామని, రానున్న ఎన్నికల్లో ఐకమత్యంతో తమ సత్తా చాటుతామని పలువురు దళిత, బహుజన, మైనార్టీ కులాల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.

బుధవారంనాడు విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో అమరావతి బహుజన ఐకాస ఉపాధ్యక్షుడు మామిడి సత్యం అధ్యక్షతన మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైకాపా ప్రభుత్వ మూడున్నరేళ్ళ పరిపాలనపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోగొట్టుకున్నది పిడికెడు ఆత్మ గౌరవం అని, దానిని నిలబెట్టుకునేందుకు పూర్వికుల స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ, వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ పైనే చంపబడ్డాను. పునరపు జననం, పునరపి మరణం అన్న కర్మ సిద్ధాంతం తెలియదు కానీ, మళ్లీ మళ్లీ చంపబడిన చోటనే పుడుతున్నాను.’ అన్న దళిత కవి కలేకూరి ప్రసాద్ ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ నినాదాన్ని 2024 రాజకీయ నినాదంగా ప్రకటించారు.రాష్ట్రంలో దళితులపై లెక్కకు మించిన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వీటన్నింటికీ బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ బాబు, శిరోముండనం వరప్రసాద్,అబ్దుల్ సలాం, వజీర, నంద్యాల నాగమ్మ, మహాలక్ష్మి, గుంటూరు రమా వంటి వందల సంఖ్యలో జరిగిన దుర్మార్గ సంఘటనలకు వైకాపా పాలనా తీరు నకళ్ళుగా మారిందని చెప్పారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రశ్నిస్తామని, రానున్న కాలంలో తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దళిత బహుజన కుల సంఘాలు, ప్రతినిధులు, అంబేద్కరిస్టులు పిడికెడు ఆత్మగౌరవం కోసం నినాదంతో కదం తొక్కాలని అన్నారు.రాష్ట్రవ్యాప్త సభలు,సమావేశాలు, దీక్షలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ ఏలుబడిలో మైనార్టీలపై దాడులు పెరిగాయని, ఏ ఒక్క సంఘటనకు న్యాయం జరగలేదన్నారు.

దళిత బహుజన కులాలతో కలిసి పిడికెడు ఆత్మగౌరవం కోసం పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరావతి దళిత మహిళల కన్వీనర్ అంకం సువర్ణకమల మాట్లాడుతూ రాజధానిలో భూములు ఇచ్చిన నేరానికి దళిత రైతులపై కూడా కేసులు పెట్టారని,ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి,చేతులకు బేడీలు వేసి, జైలుకు పంపారని ఆరోపించారు. నేషనల్ నవ క్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ బహుజన కులాలు అండలేనిదే ప్రభుత్వాలు మనజాలవని తెలిపారు. క్రింది కులాలు కోపిస్తే, గద్దె దిగాల్సిందే అని చెప్పారు.

మాల మహానాడు అధ్యక్షులు పేటర్ జోసెఫ్ మాట్లాడుతూ అన్ని కులాలు ఐకమత్యంతో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న కాలంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందిందని, ఆఖరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని ఆరోపించారు. సమావేశంలో దళిత మహిళా నాయకురాలు సరిత, రవి కుమార్ తదితరులు ప్రసంగించారు. అంతకు ముందు పిడికెడు ఆత్మగౌరవం కోసం అన్న లోగోను శిరోముండనానికి గురైన ఇండిగమిల్లి వరప్రసాద్ ఆవిష్కరించారు. ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన వరప్రసాద్ ను శాలువా కప్పి సన్మానించారు.

Related posts

ఏటూరునాగారంలో ఎటు చూసినా చెత్తకుప్పలే

Satyam NEWS

విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పెంపొందించాలి

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

Satyam NEWS

Leave a Comment