27.7 C
Hyderabad
May 4, 2024 09: 33 AM
Slider నెల్లూరు

వెంకటగిరిని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుదాం

#VenkatagiriMunicipality

నెల్లూరు జిల్లా వెంకటగిరి మునిసిపాలిటీని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు 3వ రోజు  పలువురు కౌన్సిలర్ల నివాసాలకు వెళ్లి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, వెంకటగిరి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చింతపట్ల ఉమామహేశ్వరి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పూజారి లక్ష్మి తో కలిసి నేడు ఆమె కౌన్సిలర్లను నేరుగా కలిసి మాట్లాడారు.

మంగళవారం నాడు 7,9,18,23,25 వార్డుల కౌన్సిలర్ల నివాసాలకు వెళ్లి వారిని సత్కరించి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యటించిన 7 వార్డులలోని కౌన్సిలర్లు, కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కందాటి కళ్యాణి, యచ్చా విజయలక్ష్మి, ఆటంబాకు శ్రీనివాసులు రెడ్డి, పల్లమాల శుభావలి ఆయా వార్డుల ప్రజలు నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు వెంకటగిరి పట్టణ అభివృద్ధి కి అందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు. ఈ రోజుతో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల పర్యటన ముగిసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, చింతపట్ల మురళి నాయుడు, చింతపట్ల శ్రీనివాసులు నాయుడు, సీనియర్ న్యాయవాది, వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీ. సుంకర రాజేష్, 6  వ వార్డు కౌన్సిలర్  మాడా జానకిరామయ్య, ప్రసాద్ రెడ్డి, కందాటి రాజా రెడ్డి, కసరు వెంకటసుబ్బయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

హత్య తో సంబంధం లేకపోతే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చారు?

Satyam NEWS

న్యూ ఏజెండా:దేశంలో జనాభా నియంత్రణే ఆరెస్సెస్ ఏజెండా

Satyam NEWS

సోన్ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ

Satyam NEWS

Leave a Comment