27.7 C
Hyderabad
May 4, 2024 09: 49 AM
Slider ముఖ్యంశాలు

హత్య తో సంబంధం లేకపోతే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చారు?

#YS Jagan mohan reddy

సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో ఎటువంటి సంబంధమే లేకపోతే కుటుంబ సభ్యుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం నుంచి  గ్యాగ్ ఆర్డర్ ను ఎందుకు తీసుకువచ్చారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య ది నారాసుర రక్త చరిత్రయితే,  జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను తీసుకు రావలసిన అవసరమేముందని నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ  ఆరోపిస్తున్నట్లుగా వివేకాను హత్య చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదన్న నిజం వెలుగులోకి వస్తే, దాని ప్రభావం ఎన్నికల పైన తీవ్రంగా ఉంటుందని భావించే, తనని చంపాలని చూశారు… తన చిన్నాన్న  చంపేశారని పదే పదే పేర్కొంటూ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారని తెలిపారు. అందుకే, వైఎస్ వివేక హత్య గురించి ఎవరు మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను కోర్టు నుంచి పొందారన్నారు.

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం వెనుకనున్న మతలబెమిటో అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకాను  ఆయన రెండవ భార్య, కుమార్తె, అల్లుడు ఎందుకు చంపి ఉండకూడదన్న ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ల ద్వారా  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంపించి ఉండవచ్చు కదా అని సజ్జల ఆరోపించడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. రెండవ కుటుంబం నేరం అన్నట్లుగా  సజ్జల చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, వైయస్ వెంకట్ రెడ్డికి, వైయస్ రాజారెడ్డి కి  రెండు కుటుంబాలు ఉన్నట్లుగా విస్తృతంగా ప్రజల్లో  ప్రచారంలో ఉందన్నారు. వైఎస్ వివేకా రెండవ కుటుంబంతో కాపురం చేయడం సజ్జల రామకృష్ణారెడ్డి చూశారా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, గతంలో రాజారెడ్డి ని కూడా హత్య చేయడం జరిగిందని, ఆ హత్య ను కూడా రెండవ కుటుంబం వారే చేశారని అంటే ఎలా ఉంటుందని, ఎబ్బెట్టుగా ఉండదా అని  నిలదీశారు.

ఇతరుల వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన ఎందుకని, వ్యక్తిత్వ హననం సిగ్గుచేటైనా అని మండిపడ్డారు. వైఎస్ వివేక హత్యను ఆయన రెండవ కుటుంబానికి ముడి పెట్టడం అవసరమా అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ దిశగా సజ్జలను ప్రేరేపించిన వారి మానసిక దౌర్భాల్యాన్ని తెలియజేస్తోందన్నారు. వైయస్ వివేక హత్యకు ముందు వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో  సునీల్ యాదవ్ లేనే లేరని  సజ్జల పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.

వైఎస్ వివేక హత్యకు ముందు  భాస్కర్ రెడ్డి ఇంట్లో హత్యలో పాల్గొన్న నిందితులంతా సమావేశమయ్యారని గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సిబిఐ పేర్కొంటుంటే…  దానికి భిన్నంగా సజ్జల వ్యాఖ్యలు చేయడం, దానికి మద్దతుగా భరత్ యాదవ్ స్టేట్మెంట్ ను సాక్షి ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ వివేకాను సునీల్ యాదవ్,  ఎర్ర గంగిరెడ్డి హత్య చేశారని ప్రస్తావించిన భరత్ యాదవ్, అచ్చంగా సజ్జల మాట్లాడినట్లే మాట్లాడారన్నారు.

మనం సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉంటే డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో కేసు వేసి ఉండేవారా? అని పేర్కొనడం ద్వారా, సమాజానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న సంకేతం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సునీతను తాము ఏమైనా చేయగలమని చెబుతున్నారా? సుప్రీంకోర్టును మేనేజ్ చేసే సామర్థ్యం తమకున్నప్పటికీ, మేనేజ్ చేయకపోవడం వల్లే  కేసు వేయగలిగిందని పరోక్షంగా పేర్కొంటున్నారా?, సునీతను లేపేయకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించగలిగిందని  పరోక్షంగా ప్రస్తావిస్తున్నారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

మూడు నెలలపాటు సిట్ చేత దర్యాప్తు  జరిపించిన గత ప్రభుత్వం సాధించింది ఏమిటని  సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం చూస్తే నవ్విపోదురు కాక… అన్నట్లుగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు నెలల పాటే సిట్ పోలీసులు కేసు దర్యాప్తు నిర్వహించారని, అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని గుర్తు చేశారు.అయినా తొమ్మిది నెలల పాటు దర్యాప్తు  చేసిన ప్రస్తుత ప్రభుత్వం కేసును ఒక కొలిక్కి ఎందుకు తీసుకు రాలేకపోయిందని  నిలదీశారు. వైఎస్ వివేకా హత్య తో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి, శివ ప్రసాద్ రెడ్డికి, ఆయన రెండవ కుటుంబానికి సంబంధం ఉండి ఉన్నట్లయితే  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన సిట్ పోలీసులు ఎందుకనీ వెలుగులోకి తీసుకు రాలేదని  ప్రశ్నించారు.

 కేసు దర్యాప్తు అధికారులైనా అమిత్  గార్గ్, అభిషేక్ మహంతి బదిలీ వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. తొమ్మిది నెలల పాటు దర్యాప్తు నిర్వహించి కేసు పురోగతి సాధించకపోగా, సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం  మోకాలడ్డడం ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఆదినారాయణ రెడ్డి  ఫోన్ కాల్ డాటా ను  సీబీఐ ఎందుకు పరిశీలించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్న రఘురామకృష్ణం రాజు, వైఎస్ వివేక హత్యతో సజ్జలకు సంబంధం లేదు కాబట్టి ,  ఆయన ఫోన్ కాల్ డాటా ను  సిబిఐ అధికారులు పరిశీలించలేదని, అలాగే ఆదినారాయణ రెడ్డి ఫోన్ కాల్ డాటాను పరిశీలించలేదన్నారు.

వైయస్ వివేకాను హత్య చేసింది ఎవరో… రక్తపు మరకలను తుడ్చింది ఎవరో స్పష్టంగా తెలిసిన తరువాత ఇంకా బుకాయించాలని చూడడం, ఇతరుల పైన  హత్య నేరాన్ని నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ వివేకా బావమరిది శివప్రసాద్ రెడ్డి గుండెపోటు అని చెప్పారన్న సజ్జల వ్యాఖ్యలకు  రఘురామకృష్ణం రాజు దీటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ వివేక వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి లు కలిసి గుండెపోటు డ్రామా ఆడి అదే విషయాన్ని శివప్రసాద్ రెడ్డికి చెప్పారని, వీళ్లు చెప్పిన విషయం నమ్మి ఆయన  గుండెపోటుతో మరణించినట్లుగా ఫోన్ ద్వారా ఇతరులకు సమాచారం అందించారన్నారు.

ఒళ్లంతా చీరేసి, కుట్లు వేశాక కూడా అనుమానస్పద మృతి అని అవినాష్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గుండెపోటుతో మరణించారని పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ మీరన్నట్లుగానే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలు హత్య చేస్తే, మీరెందుకు రక్తపు మరకలను తుడిచి, గాయాలకు కుట్లు వేశారని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి లు మేము హత్య చేస్తాం… మీరు రక్తపు మరకలను తుడిచి వేయండి అని చెప్పారా అంటూ అపహాస్యం చేశారు.

సిబిఐ  చంద్రబాబు అదుపు ఆజ్ఞలలో ఉందట!

రాష్ట్రంలో  సీబీఐ ని చంద్రబాబు నాయుడు అడుగుపెట్టనివ్వడం లేదని, తామే సిబిఐ  దర్యాప్తు కోరామని చెప్పిన వారే ఇప్పుడదే సిబిఐ చంద్రబాబు నాయుడు అదుపు ఆజ్ఞలలో పని చేస్తుందని పేర్కొనడం సిగ్గుచేటని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సిబిఐ దర్యాప్తుకు మోకాలు అడ్డెందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసునన్నారు. సాక్షులను  ఎంతగా ప్రభావితం చేశారో, వారి చేత ఎలా తప్పుడు వాంగ్మూలాలను ఇప్పించారో, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై  గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు.

సాక్షి దినపత్రికలో పైత్యపు కథనాలను రాసుకొని, మన పార్టీ సభ్యులను మభ్య పెట్టాలని అనుకుంటే నిజము దాచేస్తే దాగుతుందా అని ప్రశ్నించారు. మనకు మనమే మన లేకితనం ద్వారా అన్ని విషయాలను బయటపెడుతున్నామని రఘురామకృష్ణం రాజు చెప్పారు. గూగుల్ టేక్ అవుట్ గురించి సజ్జల మాట్లాడుతూ టిడిపి టేక్ అవుట్ గా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సజ్జల కేవలం ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారుడని, సాంకేతిక సలహాదారుని సంప్రదిస్తే గూగుల్ టేక్ అవుట్ గురించి చెప్పి ఉండేవాడని ఎద్దేవా చేశారు. సజ్జల ఉద్యోగ ధర్మం నిర్వహించే క్రమంలో వ్యక్తిగతంగా  తప్పులు చేస్తున్నారన్నారు.  అధికారులు అపరాధ పరిశోధనలో భాగంగా గూగుల్ టేక్ అవుట్ సహాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తిస్తారని పేర్కొన్నారు.

Related posts

భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని పట్టుకున్న అచ్చంపేట పోలీసులు

Satyam NEWS

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS

మధుర భాష మన తెలుగు

Satyam NEWS

Leave a Comment