42.2 C
Hyderabad
April 26, 2024 16: 33 PM
Slider శ్రీకాకుళం

ప్రభుత్వ ఆస్తులు అదానీ, అంబానీలకు ఇస్తున్న ప్రధాని మోడీ

#CPI Srikakulam

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో వేలాది మంది ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం  సాధించుకోగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా బిజెపి ప్రభుత్వం ప్రజా ఆస్తులను,ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని,అంబానీలకు దారాదత్తం చేస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించి తృణప్రాయముగా ప్రాణలర్పించిన భగత్ సింగ్ ,సుఖ్ దేవ్ ,రాజగురు ల అమరవీరుల 90వ వర్ధంతి దినోత్సవ సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు.

ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు  శ్రీకాకుళం పట్టణం లోని కామ్రేడ్ ఎస్ఆర్ దాసరి క్రాంతిభవన్‌లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బుడితి అప్పలనాయుడు, తాండ్ర ప్రకాష్, తాండ్ర అరుణలు, కొనారి మోహనరావులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

ఈ సందర్బంగా  రైతు కూలీ సంఘము రాష్ట్ర సహాయ కార్యదర్శి వర్మ, అరునోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు సన్నాపు శెట్టి రాజశేఖర్, అర్షం జిల్లా నాయకులు సనపల నరసింహులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తెజేశ్వరరావు, అభ్యుదయ రైతు ఖండపు ప్రసాదరావు మాట్లాడుతూ భగత్ సింగ్ గొప్ప విప్లవకారుడని , సుఖ్దేవ్ ను హింసించి చంపిన,బ్రిటీష్ అధికారిపై దాడి అనంతరం అక్కడే భయపడకుండా ఉండిపోవడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ముద్రవేయలేకపోయిందన్నారు.

ఆయన అడుగుజాడలను వామపక్ష పార్టీలే కాకుండా ఇతర పార్టీలు సైతం అనుసరిస్తున్నాయని అన్నారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ దేశంలోని సమాచారం మొత్తం సేకరించి బ్రిటీష్ వారికి అందించేదని తెలిపారు. ఆ సంస్థ నుంచి ఏర్పడిన బీజేపీ నాటి బ్రిటీష్ పాలకుల వలే దేశంలోని  కార్మికులు, కర్షకులను, రైతులను కొత్త చట్టాలతో హింసిస్తున్నారని తెలిపారు.

నేటికి 120 రోజులు కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నాయకుల్లో ఎలాంటి చలనం లేదని ఆయన అన్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా, ఎంతో మంది రైతులు ఆశువులు బాసినప్పటికీ, మోడీ ప్రభుత్వం అబద్ధపు రైతులు అని ఆరోపించడం సరికాదన్నారు.

మోడీ ప్రభుత్వం ఆధానీ, అంబానీలకే వంటి కోర్పొరేట్ శక్తుల జపం చేస్తుందని , దానికి అనుగుణంగానే వారి బంధువులకు చట్టసభలకు పంపించి ఊడిగం చేస్తుందన్నారు. నాటి గాంధీ స్వాతంత్ర్యన్ని తీసుకువస్తే నేటి అభినవ గాంధీ జయప్రకాష్ నారాయణ కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు, రైతుల మంచి కోసమే అనడం హాస్యాస్పదమన్నారు.

శాంతియుతంగా నల్లచట్టాలపై భికర ఉద్యమ పోరాటం చేస్తున్న ఢిల్లీ రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26వ తారీఖున  భారత్ బంద్ కు జిల్లా వామపక్ష పార్టీ లు సన్నద్ధమవుతున్నాయని, ఈ బందుకు వైసీపీ పార్టీ కలిసివస్తే మంచి పరిణామమని అన్నారు. ఏఐటీయుసీ జిల్లా గౌరవ అధ్యక్షులు చిక్కాల గోవిందరావు,

మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి ప్రభావతి, పి ఓ డబ్ల్యూ జిల్లా నాయకురాలు క్రిష్టవేణి, ఐఏఫ్ టీ యు నాయకులు నేతింటి నీలంరాజు,రైతు సంఘం నాయకులు పోలాకి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి సింహాచలం, పీడీ ఎస్ జిల్లా నాయకురాలు పద్మ, శ్రీకాకుళం సిటిజన్ ఫోరమ్ నాయకులు ఆదినారాయణ తదితర సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Satyam NEWS

ఉన్నతమైన ఆశయం, దృఢ సంకల్పంతో దేన్నైనా సాధించవచ్చు

Bhavani

Leave a Comment