39.2 C
Hyderabad
May 3, 2024 12: 56 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం

#tribals

తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి స్వపరిపాలన లక్ష్యంగా నూతన రాజకీయ పార్టీ అవసరమని ముక్తి భాస్కర రావు అన్నారు. శనివారం హైదరాబాద్ లోని కాప్రా భవాని నగర్ లో ఆధార్ సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో  విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో వివిధ జిల్లాలకు ఆదివాసి,మేధావులచే చర్చించి  ఆదివాసులకు నూతన రాజకీయ పార్టీ అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం ఆదివాసీ సమాజ్ పార్టీ (ASP) పేరును ప్రకటించారు. అనంతరం కోర్ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ముక్తి భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా గోడం మోతిరాం, కోశాధికారి  బోదెబోయిన రామలింగయ్య , ఉపాధ్యక్షుడిగా గొగ్గల రామస్వామి,ప్రచార కార్యదర్శిగా సాగబోయిన పాపారావు, కార్యనిర్వహణ కార్యదర్శిలుగా గన్నెబోయిన చింపిరయ్య, కల్తీ సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా కోండ్రు సుధా రాణి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలు అమలు కోసం స్వపరిపాలనే ధ్యేయంగా ఆదివాసులకు రాజకీయ పార్టీ ఆవశ్యకతను గుర్తించి పార్టీ నిర్మాణం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గొంది వెంకటరమణ,మెట్ల పాపయ్య ,బుగ్గ రామనాథం,ఈసం రవీంద్రబాబు,కొర్రి రాజు,కారం రాము తదితరులు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఓటమికి మానసిక అలసటే కారణం.. రవి శాస్త్రి

Sub Editor

విజయనగరం శిల్పారామం లో భోగీ, సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

నోటిఫికేషన్ లోగా నిర్మాణం పూర్తి కావాలి

Bhavani

Leave a Comment