30.7 C
Hyderabad
May 5, 2024 04: 17 AM
Slider క్రీడలు

ఇండోర్ స్టేడియం అభివృద్ధి కి కృషి: ఎమ్మెల్యే కోలగట్ల

#kolagatla

విజయనగరంలో ఇండోర్ స్టేడియం అభివృద్ధికి  కృషి చేస్తానని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు  డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యే కోలగట్లను తన  నివాసంలో కలసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. స్టేడియం లో  నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే కోలగట్ల కు  వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ  స్టేడియం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అందరి భాగస్వామ్యంతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.

ఇప్పటికే విజ్జీ స్టేడియం, రాజీవ్ స్టేడియం, కోడి రామ్మూర్తి వ్యాయామశాల, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి క్రీడా ప్రాంగణాలను  అభివృద్ధి చేస్తున్నామన్నారు. క్రీడాకారులకు చక్కటి ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

క్రీడాకారులకు చక్కటి ప్రోత్సాహం, అవకాశాలను అందించినట్లయితే వారి ప్రతిభ  సంపూర్ణంగా కనపరచి చక్కటి ఫలితాలు వస్తాయని నమ్మకం తనకు ఉందన్నారు. తప్పక ఇండోర్ స్టేడియం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల ను  కలిసినవారిలో  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నున్న సురేష్, ఉపాధ్యక్షులు ఎం కె బి, అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్,టి. సురేష్, మురళి, డిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి రైతులకు చేతి గాజులు ఇచ్చేసిన భువనేశ్వరి

Satyam NEWS

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!

Bhavani

మంత్రి పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వంగవీటి రాధ

Satyam NEWS

Leave a Comment