29.7 C
Hyderabad
May 2, 2024 03: 49 AM
Slider విజయనగరం

పండుగ రోజు కూడా విధుల్లో పోలీసులు…!

#police

మద్యం, పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నవైనం: 24 మంది అరెస్టు

ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ఒక్కటి. పంట చేతికొచ్చే ఈ సంక్రాంతి మర్నాడు కనుమ రోజున దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలకు సదూర ప్రాంతాల నుంచీ ప్రతీ ఒక్కరూ వచ్చి… ఆ సంబరాల్లో భాగస్వామ్యులవుతారు. సరిగ్గా అలాంటి సమయాలలో జూదం, మద్యం ఏరులై పారకుండా రాష్ట్ర పోలీసు శాఖ…అన్ని జిల్లా ల పోలీసు శాఖ లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఎస్పీ దీపికా ఆదేశాలతో జిల్లా పోలీసు శాఖ… కోడి పందాలు, పేకాట ,మద్యం విక్రయాలకు చెక్ పెట్టారు. ఆదేశాలతో పోలీసు సిబ్బంది మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. విజయనగరం వన్ టౌన్, టూటౌన్ ,జామి పీఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, 24మందిని అదుపులోకి తీసుకుని, వారిపై 5 కేసులు నమోదు చేసి, 68,560/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 కొత్తవలస  పీఎస్ పరిధిలో కోడి పందాలు ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, ఒక కేసు నమోదు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకొని, 2 కోడి పుంజులు, 1,000/- స్వాధీనం చేసుకున్నారు. ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 529 కేసులు నమోదు చేసి, ఈ-చలానా గా 1,29,465/- లను విధించారు. ప్రజలకు దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పట్ల అవగాహన కల్పించి, ఇద్దరితో యాప్ డౌన్లోడ్ చేయించారు. ఇప్పటి వరకు 7,86,949 మంది యాప్ డౌన్లోడ్ చేయించగా, 4,58,378మంది తో రిజిస్ట్రేషన్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ చేపట్టి, ప్రజలకు మహిళల భద్రత, సైబరు భద్రత, రహదారి భద్రతా పట్ల అవగాహన కల్పించారు.

Related posts

కళా వెంకటరావు అరెస్ట్…! విడుద‌ల! ఎస్పీ వివరణ

Sub Editor

కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. రైతులు నష్టపోతారు

Satyam NEWS

లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment