29.7 C
Hyderabad
May 6, 2024 04: 38 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం పోలీసుల అదుపులో సెంచ‌రీ దొంగ‌@114 థెప్ట్స్..!

#depika

మీకు ఏటీఎంల ముందు…హై క్లాస్ గా ఉద్యోగి ఎవ్వ‌రైనా ప్ర‌శ్నించారా..?  మీకు ఏటీఎంలో న‌గ‌దుబ‌దిలీకు సంబంధించి ఏమైనా స‌హ‌యం చేసాడా..?  మీకు ఏటీఎం అంటే ఏనీటైమ్ మ‌నీ గురించి సందేహాలు తీర్చాడా..?  ఆ త‌ర్వాత మీరు హ‌మ్మ‌య్య‌…నాకు ఆ దేవుడు..ఓ అజ్జాత వ్య‌క్తి రూపంలో వ‌చ్చి స‌హాయం చేసాడ‌ని భావిస్తున్నారా..?

అయితే అక్క‌డే ఆగండ‌ని అంటున్నారు…ఏపీలో ని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ బాస్.. దీపిక‌. బ్యాంకు లావాదేవీల ప‌ట్ల‌…ఏటీఎం ల‌పై మీకున్న అవ‌గాహ‌న  లేమి త‌నం…గుడ్డిగా న‌మ్మ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ఆస‌రాగా తీసుకుని…ఏకంగా  మీ ఏటీఎం కార్డుల‌తోపాటు..మీ ఏటీఎం ల‌లో ఉన్న న‌గ‌దుతో పాటు తెలివిగా మీ వ‌ద్ద ఉన్న ఆభ‌ర‌ణాల‌ను కూడా దోచే దొంగ‌లున్నారు..జాగ్ర‌త్త అని అంటున్నారు…ఎస్పీ దీపిక‌.

తాజాగా..రెండు తెలుగు రాష్ట్రాల‌లో 114 ఏటీఎం దొంగ‌త‌నాల‌ను పాల్ప‌డ్డ నిందితుడ్ని ప‌ట్టుకున్నారు..విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రం టూటౌన్  పోలీసులు. ఈ మేర‌కు ఎస్పీ ఆదేశాల మేర‌కు..సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు సూచ‌న‌ల‌తో..స్టేష‌న్ ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు…ప్ర‌సాద్, వాసులు స‌హ‌కారంతో…అంత‌రాష్ట్ర దొంగ‌ను ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఎస్పీ కార్యాల‌యంలో  పోలీస్ బాస్ దీపిక  ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుడ్ని…అత‌ని వ‌ద్ద‌వ‌నుంచీ వ‌సూలు చేసిన న‌గ‌దు,ఆభ‌ర‌ణాల‌ను ప్ర‌వేశ పెట్టారు.ఈ మేర‌కు  పోలీస్ శాఖ అందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. సహాయం ముసుగులో ఎం.టి.ఎం.కార్డులమార్పిడి చేసి మోసాలకు పాల్పడే ఘరానా మోసగాడు అరెస్టు విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషను పరిధిలో ఎం.టి.ఎం. కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులకు సహాయపడుతున్నట్లుగా నటించి, వారి బ్యాంకు ఖాతాల నుండి నగదును కొల్లగొట్టే ఘరానా మోసగాడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం.దీపిక, తెలిపారు.

నిందితుడు గుంటూరుకు చెందిన 27 ఏళ్ల‌ కూరంగి విద్యాసాగర్  ఎ.టి.ఎం. కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వారికి తనను బ్యాంకు మేనేజరుగా పరిచయం చేసుకొంటూ, ఎం.టి.ఎం. కేంద్రాల వద్ద ఉంటూ నగదును విత్ డ్రా చేసేందుకు వ‌చ్చిన‌వారిని లక్ష్యంగా చేసుకొని దొంగ‌తనాల‌కు పాల్ప‌డే వాడ‌న్నారు.,

వారికి సహాయ పడుతున్నట్లుగా నటించి, వారి పిన్ నంబరు తెలుసుకొని, వారి కార్డును తన వద్ద ఉంచుకొని, తనతో తెచ్చుకున్న వేరే కార్డును వారికి మార్పిడి చేసి, వారి బ్యాంకు ఖాతాల నుండి ఎంటిఎం కార్డును ఉపయోగించి, నగదును విత్ డ్రా చేసి, నేరాలకు పాల్పడేవాడన్నారు.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ఉద్యోగిగా ప్రజలను నమ్మించి, వారికి తనపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 101 నేరాలకు పైగా పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడు ఇదే తరహాలో నేరం చేసేందుకు ఈ నెల  25న మద్యాహ్నం దాసన్నపేట ఎ.టి.ఎం. కేంద్రం వద్ద అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే విజయనగరం టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావుకు వచ్చిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకొని, విచారణ చేప‌ట్టామ‌న్నారు.

నిందితుడు గతంలో ఇదే తరహాలో విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పిఎస్ పరిధిలో – 3, వ‌న్ టౌన్  పిఎస్ పరిధిలో – ,భోగాపురంలో , చీపురుపల్లిలో ,, సాలూరు పట్టణంలో – 2, విశాఖపట్నం సిటీ పరిధి ఎయిర్ పోర్టు ఏరియాలో – 2, భీమిలో- 2, గాజువాక,, పి.ఎం.పాలెంలో – 1, మొత్తం 14 నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడన్నారు. అరెస్టుకాబడిన నిందితుడి వద్ద నుండి పై నేరాలకు సంబంధించి రెండున్న‌ర‌.30 లక్షల నగదు, 26 గ్రాముల బరువుగల రెండు బ్రాస్లెట్స్, కొన్ని ఎ.టి.ఎం. కార్డులను స్వాధీనం చేసుకున్నట్లగా జిల్లా ఎస్పీ తెలిపారు.

అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తమ మొబైల్స్ కు వచ్చే ఒ.టి.పి.లను ఎవరికీ షేర్ చెయ్యవద్దని, ఎ.టి.ఎం. కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం కోరి, మోసపోవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ కోరారు. నిందితుడిని అరెస్టు చేసి, కేసులను చేధించుటలో క్రియాశీలకం గా పని చేసిన టూటౌన్  సీఐ సిహెచ్. లక్ష్మణరావుతో పాటు, ఏఎస్ఐ వై. పైడితల్లి, హెచ్సి టి.వి.ఆర్.కే.వి. ప్రసాద్, కానిస్టేబులు వాసులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్పీ తో పాటు దిశ డీఎస్పీ.విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ త్రినాద్, ఎస్పీ సీఐ రుద్ర‌శేఖ‌ర్ లు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

దూదిమెట్ల బాలరాజు కు కొల్లాపూర్ యాదవ సంఘం అభినందనలు

Satyam NEWS

మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలి

Murali Krishna

విఆర్ఎ లకు శాఖలు కేటాయింపు

Bhavani

Leave a Comment