36.2 C
Hyderabad
May 14, 2024 18: 29 PM
Slider ఖమ్మం

మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలి

#addl collector

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లు తమ మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు.  కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన విధంగా రైస్ మిల్లర్లు తమ మిల్లులను అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 57 రైస్ మిల్లులు ఉన్నట్లు ఆయన అన్నారు. మిల్లులను సార్టెక్స్, బ్లెండింగ్ మిషన్లతో అప్ గ్రేడ్ అవ్వాలన్నారు. ఇప్పటికి 10 మిల్లులు అప్ గ్రేడ్ అయ్యాయని, మిగతా 47 మిల్లులు త్వరితగతిన అప్ గ్రేడ్ చెందాలన్నారు. నిర్దేశిత సిఎంఆర్ డెలివరీని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ధాన్య సేకరణ కు డీసీఎంఎస్ ద్వారా 24, ఐకెపి ద్వారా 48, పిఏసీఎస్ ద్వారా 144, ఏఎంసి ద్వారా 4 మొత్తం 220కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.  ధాన్య సేకరణ కమిటీతో అన్ని స్థాయిల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా సహకార అధికారి విజయకుమారి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, డిటి లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Satyam NEWS

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment