23.7 C
Hyderabad
May 8, 2024 06: 42 AM
Slider విజయనగరం

అక్రమ మద్యం పై విజయనగరం పోలీసుల ఉక్కుపాదం….!

#illicitliquor

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల‌తో  మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు, ఎస్ఈబీ  పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒక కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాను, 6.5 లీటర్ల బీరు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 200 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై  27 కేసులను పోలీసులు నమోదు చేశారు.ఇక మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 21 కేసులను పోలీసులు నమోదు చేశారు.

హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించని వాహనదారులు, అతి వేగంగా వాహనాలను నడిపిన వారిపైన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 790 కేసులను నమోదు చేసి,1,72,220/- లను ఈ చలానగా విధించారు. అలాగే దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు  పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టి, 1,394 మంది  దిశా  యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. వీటితో దిశా యాప్ ను ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 3,54,719 కు చేరింది.

రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహన తనిఖీలు చేపట్టి, వాహన డ్రైవర్లుకు మత్తు వదిలించేందుకు వివిధ పీఎస్ పరిధిలో పోలీసు అధికారులు,  సిబ్బంది ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, రహదారి భద్రతా నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.

ఇక  బొబ్బిలి పీఎస్ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 3 ట్రాక్టర్లు, 13.5 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అదే విదంగా గుర్ల పీఎస్. పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో రైడ్ చేసి, 5గురిని అరెస్టు చేసి, 9 బైకులు, .20, 850/- ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

జీవనవిధానం మెరుగు పరిచేందుకు నూతన ఆవిష్కరణలు అవసరం

Satyam NEWS

ఇన్వెస్టిగేషన్: కాశిపాడు హత్య కేసు మిస్టరీ వీడింది

Satyam NEWS

రాష్ట్రంలో నడుస్తున్నది అసమర్థ పాలన

Satyam NEWS

Leave a Comment