39.2 C
Hyderabad
April 28, 2024 14: 32 PM
Slider రంగారెడ్డి

జీవనవిధానం మెరుగు పరిచేందుకు నూతన ఆవిష్కరణలు అవసరం

#cbit

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ – హైదరాబాద్ రీజనల్ సెంటర్ మరియు సిబిఐటి – కెమికల్ ఇంజనీరింగ్ విభాగం , సంయుక్తం గా  సిబిఐటి కళాశాల్లో ఇంటర్-కళాశాల 2023 అనే పేరిట వివిధ కళాశాల విద్యార్థులకు  వివిధ  పోటీలను  నిర్వహించింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయం , జెయెన్ టియూ హైదరాబాద్ , ఐఐఐటి – బాసర , బివిఆర్ఐటి, బిట్స్ – పిలానీ హైదరాబాద్ క్యాంపస్, యెన్ఐటి – వరంగల్ మరియు సిబిఐటి కళాశాల విద్యార్థులు మోడల్ మేకింగ్, టెక్నికల్ క్విజ్, వ్యాస రచన మరియు వక్తృత్వం వంటి విభిన్న పోటీలలో పాల్గొన్నారు .  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ – హైదరాబాద్ రీజనల్ సెంటర్  చైర్మన్ డాక్టర్ సంజయ్ భరద్వాజ్ విచ్చేసి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా అనే అంశంపై  ప్రసంగించారు.    డాక్టర్   భరద్వాజ్ మాట్లాడుతూ  నూతన ఆవిష్కరణ అనేవి   మన జీవన విధానం  మెరుగుపరచడానికి ఎంతో అవసరం. వినూత్న ఆలోచనలతో  సమర్ధవంతంగా రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, మరియు పరీక్షించడానికి   మన దగ్గర వున్నా  వనరులు చాల అవసరం. 

సమిష్టిగా దీనిని  ‘ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్’ అని అంటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో    కెమికల్ ఇంజనీరింగ్  యొక్క పాత్ర గురుంచి మరియు సిబిఐటి కళాశాల లో గల వివిధ అటల్ ఇన్నోవేషన్, ఎమ్ఎస్ఎమ్ఈ  మరియు ఇతర ఇంక్యుబేటర్లు సౌకర్యాలు  గురుంచి వివరించారు. ఈ  కార్యక్రమానికి  కెమికల్ ఇంజనీరింగ్ విభాగధిపతి   డాక్టర్ ముకుంద వాణి అధ్యక్షత వహించగా, సమన్వయకర్త గా డాక్టర్ కె. ప్రసాద్‌బాబు, డాక్టర్ నాగ ప్రపూర్ణ, డాక్టర్ గణేష్ తో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

విజయవంతంగా వార్డు సెక్రటేరియేట్ పరీక్షలు

Satyam NEWS

మొక్కలు నాటిన సినీ నటి హేమల్

Satyam NEWS

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి

Bhavani

Leave a Comment