29.7 C
Hyderabad
May 4, 2024 04: 57 AM
Slider విజయనగరం

కాటేసిన క‌రోనా… ట్రాఫిక్ పీసీ భార్య అకాల‌మృతి…

#vijayanagaram sp

డైర‌క్ట్ ఐపీఎస్ అయిన ఆమెది జాలి హృద‌యం….గ‌డ‌చిన‌కొద్ది నెల‌ల నుంచీ జిల్లాకు వ‌ణికించిన క‌రోనా స‌మ‌యంలో  ఆమె చూసిన చొర‌వేంటో క‌నిపించిన తెగువేంటో సోష‌ల్ మీడియా పుణ్య‌మా యావ‌త్ ప్ర‌పంచం తిలకించింది కూడ‌.

తాజాగా జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ విభాగంలో ప‌ని చేసే సిబ్బంది 151 నెంబ‌ర్ సోములు..కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డింది. క‌ట్టుకున్న భార్య‌,అత్త‌,పిల్ల‌లు అంతా క‌రోనాతో తెగ బాధ ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు చ‌లించిపోయారు.

అక్క‌డితో ఆగ‌కుండా ఎస్ఐ జియాయుద్దీన్ కూడా డీఎస్పీ మాదిరిగానే త‌న  సిబ్బందిని ఎలాగైన బ‌తికించుకోవాలని  ఎంత‌గానో ఆరాట‌ప‌డ్డారు…ప‌రిత‌పించారు. ఆ బాధేంటో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా తెలుసున‌ని స్వ‌యంగా రంగంలోకి దిగి  వెంటిలేట‌ర్ ఉన్న ఆంబులెన్స్ ఏర్పాటు చేసి…స్థానిక జిల్లా కేంద్ర హాస్ప‌ట‌ల్ లో చేర్పించారు.

అయితే రెండు రోజుల క్రితమే ప్రైవేటు హాస్ప‌ట‌ల్ కు తీసుకెళితే…త‌న భార్యకు కాస్త త‌గ్గి ఇంటికి వ‌స్తుందేమోనని కానిస్టేబుల్ సోములు ఆ చ‌ర్య‌ల‌నూ చేప‌ట్టాడు. అయితే  వెంటిలేట‌ర్ మీద ఉన్న మ‌నిషిని క‌దిపితే మొద‌టికే ప్ర‌మాద‌మ‌ని చెప్పి అక్కడే ఉంచారు.

స్వ‌యంగా ఎస్పీ ద్వారా సంబంధిత డాక్ట‌ర్ల‌ను ఫోన్ చేయించారు కూడ‌.  మ‌ధ్యాహ్నం వ‌రకు  ట్రాఫిక్ డీఎస్పీ హాస్ప‌ట‌ల్ లోనే ఉండి..కానిస్టేబుల్ సోముల‌కు ధైర్యం చెప్పారు కూడ‌. అయితే విధి ఆడిన నాట‌కంలో అంద‌రూ పావులైపోయారు.

ఆ రోజు రాత్రే సొములు భార్య‌…మృతి చెందింద‌న్న వార్త ట్రాఫిక్ విభాగాన్నే కుదిపేసింది. కానిస్టేబుల్ సోములు భార్య‌ను బ‌తికించేంద‌కు ఎస్పీ,డీఎస్పీలు ఇలా పోలీసు ఉన్న‌తాధికారులంతా త‌మ‌,త‌మ ప‌ర‌ప‌తిని ఉప‌యోగించిన‌ప్ప‌టికీ కానిస్టేబుల్ సొములు భార్య  ప్రాణాల‌ను మాత్రం ఎవ్వ‌రూ కాపాడేల‌క‌పోయారు.

చివ‌ర‌కు ఇదే విష‌యాన్ని..స‌వ‌రించిన క‌ర్ప్యూ స‌మ‌యం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప‌రిస్థితిని త‌నిఖీ చేసేందుకు వ‌చ్చిన ఎస్పీ కి..ట్రాఫిక్ డీఎస్పీ వివ‌రించ‌డంతో అక్క‌డిక్క‌డే కానిస్టేబుల్ సోములుతో ఎస్పీ ఫోన్ లో మాట్లాడారు. మ‌నో దైర్యం కోల్పోవ‌ద్దు అని జాగ్ర‌త్త గా ఉండంటూ హిత‌వు ప‌లికారు.

ఏదైనా ఈ క‌రోనా మ‌రీ ముఖ్యంగా ఆ వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్న పోలీసుల‌నే కాటేయం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌య‌మనని అంటోంది స‌త్యం న్యూస్.నెట్.

Related posts

పల్ప్ ప్రాజెక్టు గోవిందో గోవింద…

Satyam NEWS

ఇదేం జమానా? బతుకమ్మ కూడా ఆడనివ్వరా??

Satyam NEWS

జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతం

Satyam NEWS

Leave a Comment