Slider ఆంధ్రప్రదేశ్ జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

పల్ప్ ప్రాజెక్టు గోవిందో గోవింద…

collage

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరూ ఊహించని ఎదురుదెబ్బ ఇది. 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతున్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోయింది. వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ఏర్పాటును కంపెనీ ఉపసంహరించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్టును ఉప సంహరించుకుంటున్నట్లు సదరు కంపెనీ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.

ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం వద్ద ఇండో నేషియా ప్రభుత్వం అతి పెద్ద పల్ప్ అండ్ పేపర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు గతంలో ముందుకు వచ్చింది. దాదాపు 25 వేల కోట్ల రూపాయల మేరకు ఆ ప్రభుత్వం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. సత్యం న్యూస్ఈ పల్ప్ అండ్ పేపర్ ప్రాజెక్టు దేశంలోనే ప్రప్రధమ అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా వినుతికెక్కింది.

ఇండోనేషియా కు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపిపి) ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపడంతో ఈ ప్రాజెక్టుపై అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా ఆతృతగా ఇంతకాలం ఎదురు చూశారు. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రకాశం జిల్లా ఎంతో ప్రగతి సాధించే అవకాశం ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉండే ఆ జిల్లాలోని ప్రజా నీకానికి పర్మినెంటు ఉపాధి లభ్యం అయ్యేది.

ఈ పల్ప్ ప్రాజెక్టు లేబర్ ఓడియంటెడ్ కావడం వల్ల ఎంతో మంది రోజువారి కూలీలకు, చిన్న పాటి పెట్టుబడిదారులకు కూడా కల్పవృక్షంగా ఉండేది. ఈ పరిశ్రమ ప్యాకింగ్ పేపర్ ను, ముద్రణకు ఉపయోగపడే తెల్లకాగితాన్ని రూపొందిస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గిరాకి ఉంది.

ఇక్కడ కంపెనీ రావడం ద్వారా దేశానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉండేది. అయితే ఇప్పడు ఈ ప్రాజెక్టు రావడం లేదు. తమ పథకాన్ని సత్యం న్యూస్ఉపసంహరించుకున్నామని వారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. ప్రకాశం జిల్లా లోని  2,500 ఎకరాలను ఈ కంపెనీ ఎంపిక చేసుకున్నది. ఈ భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేనందుకే ప్రాజెక్టు వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 50 వేల మంది పల్ప్ వుడ్ రైతులకు వరదాయినిగా ఉండాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఇక రాదు.

Related posts

రాజకీయపరమైన చర్చల్లో హుందాతనం ఉండాలి

Satyam NEWS

అరుదైన గ్రూప్ రక్తాన్ని దానం చేసిన స్కూలు టీచర్

Bhavani

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment