27.7 C
Hyderabad
May 4, 2024 08: 15 AM
Slider విజయనగరం

ఆ నాలుగు ర‌హ‌దారుల‌లో ప‌క‌డ్బందీ త‌నిఖీలు చేయండి

#vijayanagaram police

సరిగ్గా ఏడాది క్రిత‌మే ఏపీ రాష్ట్రంలో క‌రోనా పుణ్య‌మా లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లైంది.డీజీపీ ఆదేశాల మేర‌కు రాస్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీలు క‌ఠినంగా క‌నీసం వ‌ల‌స కార్మికుల‌ను త‌మ‌,త‌మ రాష్ట్రాల్లోకి రానివ్వ‌కుండా బారికేడ్లు పెట్టి మ‌రీ లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌తరంగా అమ‌లు చేసారు. గిర్రున ఏడాది తిర‌గింది…క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి…

ఈ త‌రుణంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నాలుగు డిజిట్ల సంఖ్య‌ నుంచీ 260 కేసులు  మాత్రేమ క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ మేర‌కు జిల్లా ఎస్పీ  రాజ‌కుమారీ…ఓ వైపు సెట్ కాన్ఫ‌రెన్స్, మ‌రోవైపు ప్ర‌త్య‌క్షంగా రోడ్ల మీదకు వ‌చ్చి శాఖా సిబ్బందికి త‌గు సూచ‌న‌లు ఇస్తూ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంలో ముఖ్య‌భూమిక పోషించారు.

తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో క‌ర్ఫ్యూ పొడిగింపు స‌మ‌యంలో మ‌ధ్యాహ్నం రెండు గంట‌లు పూర్త‌వుతుంద‌న్న స‌మయంలో శాఖా సిబ్బంది వారు అమ‌లు చేస్తున్న విధానాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసారు…ఎస్పీ రాజ‌కుమారీ.

ఇందులో బాగంగా బంగ్లా నుంచీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రోడ్ మీదుకు వ‌చ్చిన ఎస్పీ…మ‌యూరీ జంక్ష‌న్, ఆర్డీసీ కాంప్లెక్స్, బాలాజీ,కోట, గంట‌స్థంబం జంక్ష‌న్ ల‌ను ప‌రిశీలించారు. ఆయా కూడళ్ల‌ల్లో సిబ్బంది నిర్వ‌హిస్తున్న విధుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. స్థానిక గంట‌స్థంబం వ‌ద్ద ఉన్న ప్రిన్స్ ఆఫ్ విల్స్(పీడ‌బ్య్లూ మార్క‌ట్ లోప‌ల‌కు వెళ్లి…ఇంకా షాపులు మూసేయ‌కుండా తెర‌చి ఉంచి షాపుల‌ను అందులో వ్యాపార‌స్థుల‌ను…టూటౌన్ పోలీస్ స్టేష‌న్ సిబ్బందిచే ద‌గ్గ‌రుండీ మూయించారు.

ఆదే మార్కెట్ లోంచి న్యూపూర్ణ జంక్ష‌న్(సిటీ స్టాండ్) కు వ‌చ్చి…పాత మున్సిప‌ల్ ఆఫీసులో  ఉన్న షాపుల తో పాటు చిరు వ్యాపార‌స్థుల‌ను కూడా స‌మ‌యం మించిపోయినా ఇంకా ఎందుకు తెర‌చి ఉంచ‌డంతో పాటు  రోడ్ మీదే ఎందుకు ఉన్నారంటూ త‌న సిబ్బంది ద్వారా హెచ్చ‌రించారు. ఇక్క‌డే టూటౌన్ సీఐ శ్రీనివాసరావు…నిన్న కాక మొన్న‌నే టూటౌన్ నుంచీ సీసీఎస్ కు బ‌దిలీ అయిన సీఐ శ్రీనివాస‌రావుతో అక్క‌డే చ‌ర్చించారు…ఎస్పీ.

అక్క‌డ నుంచీ టూటౌన్  పోలీస్ స్టేష‌న్ మీదుగా క‌మ్మ‌వీధి,నీళ్ల ట్యాంక్ ,రింగ్ రోడ్ మీదుగా దాస‌న్న‌పేట రైతు బ‌జార్ జంక్ష‌న్ వ‌ద్దకు వ‌చ్చి దాదాపు అర‌గంట‌సేపు ఉండీ కర్ఫ్యూ లాక్ డౌన్ విధానాలను శాఖా  సిబ్బంది ఏ విధంగా అమలు చేస్తున్నారో ప‌రిశీలించారు.

అంత‌లో అక్క‌డికే వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ వ‌చ్చి…ఎస్పీకి విష్ చేసి…త‌న ప‌రిధిలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఏ విధంగా అమ‌లు ప‌రుస్తున్నామో తెలియ చేసారు.ఈ ఎస్పీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లో ట్రాఫిక్ ఎస్ఐలు,హ‌రిబాబు, భాస్క‌ర‌రావు, దామోద‌ర‌రావు,శాఖ ఫోటో గ్రాఫ‌ర్ కృష్ణ ఇత‌ర సిబ్బంది ఉన్నారు.

చివ‌రిలో వై జంక్ష‌న్ నుంచీ ఎత్తు బ్రిడ్జి ,అలాగే మ‌యూరీ జంక్ష‌న్ నుంచీ బాలాజీ, అక్క‌డ నుంచీ క‌న్య‌కాపర‌మేశ్వ‌రి టెంపుల్, అక్క‌డ నుంచీ సీఎంఆర్ మీదుగా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను అమ‌లు ప‌రిచేలా సిబ్బందిని పెట్టి ప‌క‌బ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్పీ సూచ‌న‌లు జారీ చేసారు.

Related posts

మద్యం అమ్మాలని ప్రధాని మోడీ చెప్పలేదు

Satyam NEWS

స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment