40.2 C
Hyderabad
April 26, 2024 13: 17 PM
Slider ఆధ్యాత్మికం

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

#hujurnagartemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వయంగా వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదటి రోజు గణపతి పూజ,పుణ్యాహవచనం, నవగ్రహారాధన,అఖండ దీపారాధన,కలశ స్థాపనతో ప్రారంభమై శ్రీ కనకదుర్గ అమ్మవారికి పంచసూక్త విధానంగా ప్రత్యేక అభిషేకాలు శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

ప్రదోష కాల సమయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని స్వర్ణ,రంజిత ఆభరణాలతో,నూతన పట్టు వస్త్రాలతో స్వర్ణకవచాలాంకృత శ్రీ దుర్గాదేవి గా అలంకరించి కల్పోక్త విధంగా షోడశోపచార పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ దుర్గాదేవి సహస్రనామాలతో విశేష కుంకుమార్చనలు,గుడి సేవా,మహా నీరాజన మంత్రపుష్పం,సమర్పించారు. పిదప తీర్ధ ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో వేదమూర్తులు పోతావఝ్ఝుల ఫల్గుణ శర్మ,ఆలయ అర్చకులు నరగిరినాధుని నర్సిహాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ కనకదుర్గ అమ్మవారిని సేవించి తరించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఇరిగేష‌న్ అధికారుల‌పై మంత్రి ఆగ్రహం..!

Sub Editor

NEW Cbd Oil And Narcolepsy Is Hemp Cbd Oil Illegal In Alabama

Bhavani

రెండో రోజు 6 నామినేషన్లు: అందరూ స్వతంత్రులే

Satyam NEWS

Leave a Comment